'ఫ్రెండ్షిప్ చేయండి, లేకపోతే..' హిందూ బాలికలకు బెదిరింపులు!
Hindu girls harassed in Ranchi : రాంచీలో 9వ తరగతి చదువుకుంటున్న హిందూ బాలికలు బెదిరింపులకు గురయ్యారు. తమతో ఫ్రెండ్షిప్ చేయాలని, లేకపోతే కిడ్నాప్ చేస్తామని పలువురు ముస్లింలు ఆయుధాలతో బెదిరించారు. ఇదంతా ఓ స్కూల్లో జరగడం గమనార్హం.
Hindu girls harassed in Ranchi : ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు కలకలం సృష్టించింది. కొందరు ముస్లింలు.. ఓ స్కూల్లోకి ఆయుధాలతో ప్రవేశించారు. అక్కడి బాలికలను బెదిరించారు. తమతో ఫ్రెండ్షిప్ చేయాలని, లేకపోతే కిడ్నాప్ చేస్తామని హెచ్చరించారు!
స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఆ బాలికలు 9వ తరగతి చదువుకుంటున్నారు. వారిలో కొందరు గిరిజనులు, కొందరు హిందువులు ఉన్నారు. కాగా.. గత కొన్ని రోజులుగా.. వారికి బెదిరింపులు ఎదురువుతున్నాయి. ఫ్రెండ్షిప్ చేయాలని ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే కొందరు ముస్లింలు.. ఆయుధాలు పట్టుకుని స్కూల్లోకి ప్రవేశించి అందరిని బెదిరించారు. తమతో ఫ్రెండ్షిప్ చేయాలని , లేకపోతే కిడ్నాప్ తప్పదని హెచ్చరికలు జారీచేశారు. అక్కడే ఉన్న ఉపాధ్యాయులు, కొందరు స్టూడెంట్స్.. ఆ బృందాన్ని నియంత్రించేందుకు వెళ్లారు. కానీ తమ ఆయుధాలతో వారిని కూడా బెదిరించారు.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై విచారణ జరిపేందుకు.. ఐదుగురు సభ్యుల సిట్ ఏర్పాటైంది. కాగా.. ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అయితే.. ఘటనకు మతం రంగు రుద్దం సరైనది కాదని పోలీసులు చెబుతున్నారు.
Ranchi crime news : "ఈ వ్యవహారానికి మతం రంగు పూయడం సరైనది కాదు. ఇక్కడ ఉన్న వారందరికీ ఈ విషయం తెలుసు. మేము అమాయకులను ముట్టుకోము. నిందితులను విడిచిపెట్టము," అని ఓ సీనియర్ పోలీసు అధికారి.. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టూడేకి వెళ్లడించారు.
తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం..
Jharkhand love Jihad incidents : హిందూ బాలికలపై బెదిరింపులకు సంబంధించిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. హేమంత్ సొరేన్ ప్రభుత్వం విఫలమైందని విరుచుకుపడింది. లవ్ జీహాద్ వంటి కార్యకలాపాలు రాష్ట్రంలో పెరిగిపోయాయని ఆరోపించింది. హిందూ బాలికలపై ముస్లింలు దాడి చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది.
ఝార్ఖండ్‌లో గిరిజనులు, హిందూ బాలికలపై హింసాత్మక ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. కాగా.. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న హేమంత్ సొరేన్‌కు ఇవి మరిన్ని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
ఇటీవలే.. డుంకా ప్రాంతంలో.. ఓ బాలికకు ఓ వ్యక్తి నిప్పంటించాడు. తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ బాలిక.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే.. డుంకా ప్రాంతంలో మరో బాలిక మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. సామూహిక అత్యాచారానికి గురవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి.
సంబంధిత కథనం