తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Huawei Nova 10 Se | 108 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన హువావే స్మార్ట్‌ఫోన్‌!

Huawei Nova 10 SE | 108 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చిన హువావే స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

27 September 2022, 23:00 IST

    • హువావే మొబైల్ బ్రాండ్ తమ Nova 10 లైనప్‌లో సరికొత్త Huawei Nova 10 SE స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. ఇందులో కెమెరా ప్రధాన ఆకర్షణ, మిగతా ప్రత్యేకతలు చూడండి.
Huawei Nova 10 SE
Huawei Nova 10 SE

Huawei Nova 10 SE

మొబైల్ తయారీదారు హువావే నుంచి సరికొత్తగా Huawei Nova 10 SE అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఇది గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. గతంలో విడుదలైన Nova 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ఉన్నట్లుగా కర్వ్‌డ్ డిస్‌ప్లేలు కాకుండా ఈ కొత్త ఫోన్ మోడల్ ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

Drink for Lungs: ఊపిరితిత్తులు శుభ్రపడాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు, ఏ మందులూ అవసరం లేదు

IDIOT Syndrome : ఇంటర్నెట్‌లో ప్రతిదీ సెర్చ్ చేస్తే ఇడియట్.. ఈ రోగం ఉన్నట్టే!

Boti Masala Fry: బోటీ మసాలా ఫ్రై ఇలా చేస్తే బగారా రైస్‌తో జతగా అదిరిపోతుంది

ర్యామ్, స్టోరేజ్ పరంగా Huawei Nova 10 SE ఫోన్ ఏకైక 8GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లో లభిస్తుంది. అయితే ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ సిరీస్ లోని గత మోడల్స్ దాదాపు రూ. 30 వేల నుంచి 40 వేల వరకు ఉన్నాయి. అయితే ఈ హ్యాండ్‌సెట్ Nova 10 లైనప్‌లో అత్యంత సరసమైన ధరలో లభించే ఫోన్‌గా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ హ్యాండ్‌సెట్ 7.39 మిమీ మందంతో, 184 గ్రాముల బరువుతో మెరిసే సిల్వర్ ప్యానెల్ డిజైన్ తో వచ్చింది. Nova 10 SEలో డ్యూయల్ సిమ్, Wi-Fi, బ్లూటూత్, GPS, USB-C వంటి సాధారణ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకోండి.

Huawei Nova 10 SE స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే
  • 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • వెనకవైపు 108MP+8MP+2MP కెమెరా, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12, Magic UI ఆపరేటింగ్ సిస్టమ్
  • 4500 mAh బ్యాటరీ సామర్థ్యం, 66W ఛార్జర్

ఈ ఫోన్ Google యాప్‌లు , గూగుల్ సర్వీసులకు సపోర్ట్ చేయదు. అలాగే ఇది 5G కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుందో లేదో కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఈ ఫోన్ కొనుగోలు చేయాలనే ఆసక్తి కలిగినవారు, ప్రత్యామ్నాయ మోడల్స్ వైపు చూడటం మంచిది.

తదుపరి వ్యాసం