Huawei Mate 50 Pro । హువావే నుంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్, ధర చాలా ఎక్కువైంది!
హువావే కంపెనీ పోర్షే డిజైన్‌తో సరికొత్త Huawei Mate 50 Pro స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్ ధర చాలా ఎక్కువగా ఉంది. మరి ఫీచర్లపై ఓ లుక్ వేయండి.
మొబైల్ తయారీదారు హువావే తమ Mate సిరీస్‌లో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో Huawei Mate 50 Pro అనేది హువావే బ్రాండ్ నుంచి విడుదలైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. మరొకటి Huawei Mate 50 RS. పోర్షే డిజైన్‌లతో వచ్చిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లు నవంబర్ 2020లో లాంచ్ చేసిన Huawei Mate 40 సిరీస్ ఫోన్‌లకు సక్సెసర్లుగా నిలుస్తాయి.

Huawei Mate 50 Pro స్మార్ట్‌ఫోన్ ఎన్నో ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో భాగంగా OLED డిస్‌ప్లే, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు అదనంగా మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ Qualcomm టాప్-ఎండ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌తో శక్తిని పొందుతుంది. అయితే ఈ ఫోన్‌లో 5జీ కనెక్టివిటీ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.
Huawei Mate 50 Pro ఐదు విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కలర్ ఆప్షన్స్ పరిశీలిస్తే డేబ్రేక్, ఫ్రాస్ట్ సిల్వర్, కున్‌లున్ జియాగువాంగ్, అబ్సిడియన్ బ్లాక్, స్ట్రీమర్ పర్పుల్ ఉన్నాయి. వివిధ స్టోరేజ్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? ధర ఎంత? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకోండి.
Huawei Mate 50 Pro స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.74 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లే
8GB RAM, 256GB/512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
వెనకవైపు 64MP+50MP+13MP కెమెరా, ముందు భాగంలో 13MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
4700 mAh బ్యాటరీ సామర్థ్యం, 66W ఛార్జర్
Huawei Mate 50 Pro ధరలు ఈ విధంగా ఉన్నాయి. 256GB వేరియంట్ కోసం 6,799 యువాన్ (సుమారు రూ. 78,000) , కాగా 512GB వేరియంట్ కోసం ధర 7,799 యువాన్ (సుమారు రూ. 89,400) ఇవి గ్లోబల్ మార్కెట్లోకి త్వరలో అందుబాటులోకి వస్తాయి.
సంబంధిత కథనం