తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Gravy Recipe : బంగాళదుంప గ్రేవీ.. చాలా ఈజీగా తయారు చేయోచ్చు

Potato Gravy Recipe : బంగాళదుంప గ్రేవీ.. చాలా ఈజీగా తయారు చేయోచ్చు

Anand Sai HT Telugu

24 March 2024, 11:30 IST

    • Potato Gravy Recipe In Telugu : బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచివి. అయితే వీటిని ఉడకబెట్టి గ్రేవీ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది.
పొటాటో గ్రేవీ
పొటాటో గ్రేవీ (Unsplash)

పొటాటో గ్రేవీ

తెలుగు రాష్ట్రాల్లో వారంలో ఒక్కసారైనా బంగాళదుంపతో కర్రీ చేస్తారు. కొందరు ఫ్రై చేసుకుని పచ్చి పులుసు చేసుకుని తింటారు. మరికొందరు గ్రేవీ చేసుకుంటారు. ఈ గ్రేవీని చపాతీ, అన్నంలోకి మాత్రమే కాదు.. ఇడ్లీ, దోసెలోకి కూడా తినవచ్చు. ఇంట్లో బంగాళదుంపు కచ్చితంగా మెయింటెన్ చేస్తారు. అలాంటప్పుడు ఫటాఫట్ గ్రేవీని కూడా తయారు చేసేకోవచ్చు. ఈ పొటాటో గ్రేవీని తయారుచేసుకునేందుకు టైమ్ కూడా పెద్దగా పట్టదు. ఈజీగా తయారు చేయవచ్చు. పొటాటో గ్రేవీ తయారీ విధానం ఏంటో చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti In Telugu : భర్తతో సంతృప్తిగా లేకపోతే భార్య ఈ పనులు చేస్తుంది

Avoid Nonstickware: నాన్ స్టిక్ వంట సామాను చూసేందుకు స్టైల్‌గా ఉంటాయి, కానీ మీ ఆరోగ్యాన్ని తినేస్తాయి

Ragi Garelu: రాగులతో గారెలు చేసి చూడండి, క్రంచీగా టేస్టీగా ఉంటాయి

Monday Motivation: మొదటి చూపులోనే వ్యక్తులను తప్పుడు అంచనా వేయకండి, ప్రతి వ్యక్తి వెనక ఏదో ఒక విషాద కథ ఉంటుంది

పొటాటో గ్రేవీకి కావాల్సిన పదార్థాలు

నూనె - 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు - 1, దాల్చిన చెక్క - 1 ముక్క, లవంగాలు - 3, జీలకర్ర - 1/2 tsp, సోంపు - 1/2 tsp, కరివేపాకు - కొద్దిగా, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 tsp, పసుపు పొడి - 1/4 tsp, కారం పొడి - 1 1/2 tsp, గరం మసాలా - 1/2 tsp, బెల్లం పొడి - 1 tsp, ఉప్పు - రుచికి, పెరుగు - 1/4 కప్పు, బంగాళదుంప - 4, నీళ్లు - కావలసినంత, కొత్తిమీర - కొద్దిగా

పొటాటో గ్రేవీ తయారీ విధానం

ముందుగా బంగాళదుంపలను ఉడికించాలి. వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి.

తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకులు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.

తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి.

తర్వాత పసుపు పొడి, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా, రుచికి ఉప్పు వేసి 1 నిమిషం పాటు కదిలించాలి.

ఇప్పుడు గట్టి పెరుగును బాగా కొట్టండి, అందులో వేసుకుని 2 నిమిషాలు ఉడకనివ్వండి.

తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసి కలుపుకోవాలి. గ్రేవీకి కావల్సినంత నీళ్లు పోసి కాసేపు మరిగించి కొత్తిమీర చల్లితే రుచికరమైన పొటాటో గ్రేవీ రెడీ.

బంగాళదుంప ప్రయోజనాలు

బంగాళదుంప గ్రేవీని అన్నంలోకి తినవచ్చు. చపాతీలోకి కూడా బాగుంటుంది. నిజానికి బంగాళదుంపతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ B6 దొరుకుతాయి. ఇవి డైటరీ ఫైబర్ యొక్క మంచి మూలం. జీర్ణక్రియను ప్రోత్సహించడంలో, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బంగాళాదుంపలు కేలరీలు, కొవ్వులు తక్కువగా ఉంటాయి.

బంగాళాదుంపలలో ఒక రకమైన కార్బోహైడ్రేట్ రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది ప్రీబయోటిక్‌గా పని చేస్తుంది. ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియ, మొత్తం గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

బంగాళదుంపలలోని అధిక పొటాషియం కంటెంట్ ఆహారంలో సోడియం ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. బంగాళదుంపలలోని ఫైబర్, పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం