Brinjal Chips: బంగాళదుంప చిప్స్‌లాగే వంకాయ చిప్స్ చేయొచ్చు, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి-brinjal chips recipe in telugu know how to make this chips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Brinjal Chips: బంగాళదుంప చిప్స్‌లాగే వంకాయ చిప్స్ చేయొచ్చు, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి

Brinjal Chips: బంగాళదుంప చిప్స్‌లాగే వంకాయ చిప్స్ చేయొచ్చు, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి

Haritha Chappa HT Telugu
Feb 21, 2024 03:30 PM IST

Brinjal Chips: చిప్స్ అనగానే అందరికీ బంగాళదుంప చిప్స్ గుర్తుకు వస్తాయి. వంకాయలతోనూ టేస్టీ చిప్స్ తయారు చేయొచ్చు. వీటి రెసిపీ చాలా సులువు. బైంగన్ చిప్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

వంకాయ చిప్స్ రెసిపీ
వంకాయ చిప్స్ రెసిపీ

Brinjal Chips: వంకాయ అంటే కేవలం కూరగా, వేపుడుగా మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటారు. వీటితో టేస్టీగా చిప్స్ కూడా చేసుకోవచ్చు. బంగాళదుంప చిప్స్‌లాగే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వీటిని ఈజీగా చేయొచ్చు. పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్‌గా ఇవి ఉపయోగపడతాయి. భైంగన్ చిప్స్ అని పిలిచే ఈ వంకాయ చిప్స్‌ను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బైంగన్ చిప్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు

వంకాయలు - రెండు

నూనె - డీప్ ఫ్రై చెయ్యడానికి సరిపడా

ఉప్పు - రుచికి సరిపడా

మిరియాల పొడి - అర స్పూను

కారం - ఒక స్పూను

వంకాయ చిప్స్ రెసిపీ

1.వంకాయను సన్నని గుండ్రని ముక్కలుగా కోసుకోండి.

2. బంగాళదుంపని ఎలా చిప్స్ కోసం కోసుకుంటారో అలానే ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి.

3. అందులో ఈ వంకాయ ముక్కలను తడి లేకుండా తుడుచుకొని నూనెలో వేసి ఫ్రై చేయండి.

4. వాటిని తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేయండి.

5. అదనపు నూనెను టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది.

6. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ వంకాయ చిప్స్‌ను వేసి ఉప్పు, మిరియాల పొడి, కారాన్ని చల్లి బాగా ఆడించండి.

7. ఈ మూడు చిప్స్‌కు అంటుకునేలా చూడండి, అంతే వంకాయ చిప్స్ రెడీ అయినట్టే.

వీటిని ఓవెన్లో కూడా తయారు చేయొచ్చు. వంకాయ ముక్కలను తడి లేకుండా తుడుచుకొని బేకింగ్ ట్రే లో వరుసగా పేర్చండి. వీటిపై కాస్త నూనెను బ్రష్‌తో అద్దండి. పైన మిరియాల పొడి, కారం, ఉప్పు చల్లుకోండి. ఓవెన్లో పెట్టి అవి క్రిస్పీగా అయ్యేవరకు ఉంచండి.అంతే వంకాయ చిప్స్ రెడీ అయినట్టే.

బంగాళదుంప చిప్స్‌లాగే ఇవి కూడా కరకరలాడుతాయి.రుచిగా కూడా ఉంటాయి.ఎప్పుడు ఆలూ చిప్స్ తింటే బోర్ కొట్టేస్తుంది. ఇలా ఇతర కూరగాయలతో కూడా చిప్స్ ఇలా ట్రై చేసుకుని చూడండి. కేవలం వంకాయ చిప్స్ మాత్రమే కాదు, ఇలా దొండకాయ, బెండకాయ, కాకరకాయ, అరటికాయ చిప్స్‌ను చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు. ఇంట్లోనే మీరు తయారు చేసుకుంటారు కాబట్టి ఎలాంటి రసాయనాలు, ప్రిజర్వేటివ్స్ దీనిలో కలవవు. పిల్లలకు తినిపించేందుకు ఇవి పూర్తి సురక్షితం కూడా. స్టవ్ మీద కళాయిలో వేయించిన చిప్స్ కన్నా ఓవెన్ లో వేసిన చిప్స్ ఆరోగ్యకరమైనవి. ఎందుకంటే వీటిలో నూనె శాతం తక్కువగా ఉంటుంది. ఓవెన్ లేనివారు ఇక స్టవ్ మీద పెట్టిన కళాయిలోనే వేయించుకోవాలి.

WhatsApp channel

టాపిక్