Dondakaya Ulli Karam Recipe: దొండకాయలతో ఇలా ఉల్లికారం చేస్తే టేస్ట్ అదుర్స్.. తయారీ చాలా ఈజీ!
15 December 2024, 17:30 IST
- Dondakaya Ulli Karam Recipe: దొండకాయ ఉల్లికారం టేస్ట్ అదిరిపోతుంది. కాస్త ఘాటుగా ఉండే దీన్ని అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అనాల్సిందే. దీన్ని చేయడం కూడా సులభమే.
Dondakaya Ulli Karam Recipe: దొండకాయలతో ఇలా ఉల్లికారం చేస్తే టేస్ట్ అదుర్స్.. తయారీ చాలా ఈజీ!
Dondakaya Ulli Karam Recipe: దొండకాయలతో ఇలా ఉల్లికారం చేస్తే టేస్ట్ అదుర్స్.. తయారీ చాలా ఈజీ!
త్వరగా, టేస్టీగా అన్నంలో కలుపుకొని తినేందుకు ఏదైనా చేయాలనుకుంటే ‘దొండకాయ ఉల్లికారం’ మంచి ఆప్షన్‍గా ఉంటుంది. పావు గంటలోనే ఈ కూర రెడీ అయిపోతుంది. కారంగా.. కాస్త ఘాటుగా టేస్ట్ అదిరిపోతుంది. ఉల్లిపాయ ఫ్లేవర్ బాగుంటుంది. అన్నంతో పాటు చపాతీలోకి కూడా తినేందుకు ఇది చాలా సూటవుతుంది. ఈ ‘దొండకాయ ఉల్లికారం’ ఎలా చేయాలంటే..
దొండకాయ ఉల్లికారం చేసేందుకు కావాల్సిన పదార్థాలు
- 250 గ్రాముల దొండకాయలు
- మూడు ఉల్లిపాయలు (నిలువుగా తరగాలి)
- ఎనిమిది ఎండుమిర్చి
- మూడు టేబుల్ స్పూన్‍ల నూనె
- పావు టీస్పూన్ మెంతులు
- ఓ టేబుల్‍స్పూన్ ధనియాలు
- అర టీస్పూన్ జీలకర్ర
- ఐదు వెల్లుల్లి రెబ్బలు
- రుచికి సరిపడా ఉప్పు
- అర టీస్పూన్ పసుపు
- రెండు టీస్పూన్‍ల చింతపండు
- రెండు రెబ్బల కరివేపాకు
- కాస్త కొత్తిమీర
దొండకాయ ఉల్లికారం తయారీ విధానం
- దొండకాయలను నీటిలో శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. నిలువుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్‍పై ప్యాన్ పెట్టుకొని ముందుగా మెంతులు వేసి కాస్త వేపాలి. దాంట్లోనే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాలను వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక పక్కన పెట్టుకోవాలి.
- అదే ప్యాన్‍లో ఓ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. దాంట్లో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయలకు కాస్త మెత్తబడే వరకు దోరగా వేపుకొని పక్కన తీసుపెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఆ ప్యాన్‍లో రెండు టేబుల్ స్పూన్‍ల నూనె వేసుకోవాలి. అందులో కట్ చేసిన దొండకాయలను ఫ్రై చేసుకోవాలి.
- మూడు నిమిషాలు దొండకాయలను ఫ్రై చేశాక ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. దానిపై మూత పెట్టి దొండకాయ ముక్కలను ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
- ఆలోగా.. ఇంతకు ముందే వేపుకున్న మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్రను ఓ మిక్సీజార్‌లో వేసుకొని బాగా పొడిలా చేసుకోవాలి. పొడి అయ్యాక అదే మిక్సీ జార్‌లోనే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త కచ్చాపచ్చాగా బరక పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి.
- దొండకాయల ముక్కలు ఉడికాక అందులో ఈ పేస్ట్ వేసి బాగా కలపాలి. ముక్కలకు ఇది బాగా పట్టేలా మిక్స్ చేయాలి. అన్నింటినీ కలుపుకొని మూడు నిమిషాలు ఫ్రై చేయాలి. చివర్లో కాస్త కొత్తమీర వేయాలి. అంతే దొండకాయ ఉల్లికారం రెడీ.