Cabbage 65 Recipe: కరకరలాడుతూ వావ్ అనిపించే క్యాబేజ్ 65.. ఎలా చేయాలంటే?
15 December 2024, 15:30 IST
- Cabbage 65 Recipe: క్యాబేజ్ 65 కరకరలాడుతూ అదిరిపోతుంది. భోజనంలో నంచుకునేందుకు సూటవుతుంది. రుచి బాగా కుదురుతుంది. క్యాబేజ్ 65 ఎలా చేయాలంటే..
Cabbage 65 Recipe: కరకరలాడుతూ వావ్ అనిపించే క్యాబేజ్ 65.. ఎలా చేయాలంటే?
Cabbage 65 Recipe: కరకరలాడుతూ వావ్ అనిపించే క్యాబేజ్ 65.. ఎలా చేయాలంటే?
క్యాబేజీతో కర్రీలే కాకుండా కరకరలాండే ఫ్రై కూడా చేసుకోవచ్చు. పప్పు, సాంబార్ అన్నంలో నంచుకునేందుకు ఈ క్యాబేజీ 65 సరిగ్గా సూటవుతుంది. అదిరిపోయే టేస్ట్ ఇస్తుంది. క్యాబేజీ ఫ్లేవర్‌తో క్రంచీగా మరింత తినాలనిపించేలా ఉంటుంది. ఈ క్యాబేజీ 65 ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
క్యాబేజీ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు
- మీడియం సైజ్ క్యాబేజీ (సుమారు 800 గ్రాములు)
- పావు కప్పు బియ్యం పిండి
- పావు కప్పు మైదా
- రెండు టేబుల్ స్పూన్‍ల కారం
- ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి
- ఓ టేబుల్ స్పూన్ ధనియాల పొడి
- రుచికి సరిపడా ఉప్పు
- చిటికెడు పసుపు
- ఓ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీసాస్
- రెండు టీస్పూన్‍ల టమాటో కెచప్
- రెండు టీస్పూన్‍ల అల్లం వెల్లుల్లి పేస్ట్
- రెండు రెబ్బల కరివేపాకు
- ఫుడ్ కలర్ (ఆప్షనల్)
క్యాబేజీ 65 తయారు చేసుకునే విధానం
- ముందుగా క్యాబేజీని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా ముక్కలు పెద్దగా ఉండేలా చూసుకోవాలి.
- క్యాబేజీ ముక్కలను ఓ మిక్సింగ్ బౌల్‍లో వేసుకోవాలి. అందులో కారం, ధనియాల పొడి, పసుపు, గ్రీన్ చిల్లీసాస్, టమాటో కెచప్, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి.
- క్యాబేజీ ముక్కలు పిండుతూ కాకుండా కాస్త మృధువుగా కలుపుకోవాలి. అన్ని పదార్థాలు క్యాబేజీ ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి అలా కలపాలి.
- అనంతరం స్టవ్‍పై కళాయి పెట్టి నూనె మరిగించుకోవాలి. నూనె వేడెక్కాక కలుపుకున్న క్యాబేజీ ముద్దను కాస్తకాస్త తీసుకొని వేళ్లతో నూనెలో వేయాలి.
- మీడియం మంటపై ఈ క్యాబేజీని ఫ్రై చేసుకోవాలి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టకుండా ఓ రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత మంటను ఎక్కువ పెట్టి ఫ్రై చేసుకోవాలి.
- గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బయటికి తీసేసుకోవాలి. అంతే క్యాబేజీ 65 తయారీ పూర్తవుతుంది. ఇక తినేయవచ్చు.