తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Tips : ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదా? ఇలా ట్రై చేయండి

Sleeping Tips : ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదా? ఇలా ట్రై చేయండి

Anand Sai HT Telugu

29 January 2024, 18:50 IST

google News
    • Sleeping Tips : మనిషికి నిద్ర చాలా ముఖ్యం. సరైన నిద్రలేకుంటే శరీర ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే నిద్ర హాయిగా పడుతుంది.
నిద్ర సమస్యలు
నిద్ర సమస్యలు (Unsplash)

నిద్ర సమస్యలు

రాత్రిపూట తగినంత నిద్రను ఉంటే మంచి శక్తితో చురుకుగా ఉంటారు. నిద్ర శరీరానికి విశ్రాంతినిస్తుంది, మనస్సును రిఫ్రెష్ చేస్తుంది. మరుసటి రోజు తిరిగి శక్తినివ్వడానికి నిద్ర చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా మంది రాత్రిపూట నిద్రలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫలితంగా వారు నిద్రలేమితో బాధపడుతున్నారు. తగినంత నిద్ర లేకపోతే అనేక వ్యాధులు వస్తాయి. రాత్రి నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట పని సరిగా చేయలేం. రోజంతా అలసటగా ఉంటుంది. రోజువారీ పనులు కూడా దెబ్బతింటాయి. నిద్రలేమిని వదిలించుకునేందుకు కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తుంది, మొత్తం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది, మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది. ఒకే చోట కూర్చోవడం మొదట్లో ఇబ్బందిగా ఉంటుంది. కానీ మీరు రోజూ ప్రాక్టీస్ చేస్తే.. ఈజీగా ధ్యానం చేయెుచ్చు. ప్రతిరోజూ ఉదయం కొంత సమయం కేటాయించి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి.

లావెండర్ ఆయిల్ నిద్రను ప్రోత్సహిస్తుంది. ఈ నూనె మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మంచి ప్రశాంతమైన నిద్రను పొందడంలో ఉపయోగపడుతుంది. ఈ నూనె వాసన పీల్చుకోండి లేదా మీ దిండుపై చుక్కలను వేయండి. లావెండర్ టీని కూడా తయారు చేసి తాగొచ్చు. లావెండర్ ఆయిల్ కొబ్బరినూనెతో కలిపి నుదుటిపై మసాజ్ చేసుకోండి.

విశ్రాంతి కోసం మసాజ్ కూడా ఒక మార్గం. మసాజ్ చేయడానికి నూనెను ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు సుగంధ నూనెలను ఉపయోగిస్తే ఒత్తిడి నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మంచి ప్రశాంతమైన గాఢ నిద్ర వస్తుంది. కొబ్బరి నూనెతో సుగంధ నూనెలను కలిపి వాడుకోండి.

నిద్రలేమితో బాధపడేవారు ఆహారంలో చిన్నపాటి మార్పు చేసుకోవాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని కొంచెం ఎక్కువగా తింటే ఒత్తిడిని దూరం చేసి మనసును రిలాక్స్‌గా చేస్తుంది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలలో బచ్చలికూర, అరటిపండ్లు, చిక్‌పీస్, బ్రోకలీ, కిడ్నీ బీన్స్, నట్స్, సీఫుడ్ ఉంటాయి.

వ్యాయామం చేయడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రోజువారీ వ్యాయామం ద్వారా నిద్రలేమి లక్షణాలను నియంత్రించవచ్చు. రోజూ తగినంత వ్యాయామం లేదా ఇంటిపని చేయడం చాలా ముఖ్యం. సోమరితనానికి గుడ్ బై చెప్పవచ్చు. ప్రశాంతమైన గాఢ నిద్ర, ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందడానికి ఉదయం వ్యాయామం చేయాలి.

మంచి నిద్ర పొందడానికి పడుకునే ముందు ఒక కప్పు గోరువెచ్చని పాలు తాగండి. 1/4 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని మిక్స్ చేసి పడుకునే అర్ధగంట ముందు తాగాలి. ఒక కప్పు గోరువెచ్చని పాలలో 1 టీస్పూన్ జాజికాయ పొడిని మిక్స్ చేసి తాగిన కూడా ఫలితం ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్‌లోని అమినో యాసిడ్‌లు అలసట నుండి ఉపశమనాన్ని ఇస్తాయి. శరీరానికి విశ్రాంతిని, మంచి నిద్రను కలిగించడంలో ఉపయోగపడతాయి. తేనెలోని రిలాక్సింగ్ గుణాలు మెదడులో సెరోటోనిన్ విడుదలను ప్రేరేపించేలా చేస్తాయి. నిద్ర చక్రాన్ని నియంత్రిస్తాయి. 1 కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల తేనె, యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి నిద్రకు ముందు తాగండి.

తదుపరి వ్యాసం