రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తాగడం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీర బరువును తగ్గించుకోవచ్చు. దాల్చిన చెక్క లేదా దాని పొడిని గోరువెచ్చని నీటిలో కలపి తాగాలి.
Unsplash
By Anand Sai Oct 22, 2023
Hindustan Times Telugu
1.5 కప్పుల నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించాలి. చల్లారగానే వడగట్టి ఆ నీటిని గ్లాసులోకి మార్చి అందులో కాస్త తేనె కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి.
Unsplash
దాల్చిన చెక్కను వేడి నీటిలో కలిపి రాత్రిపూట తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులువవుతుంది. అజీర్ణం, అపానవాయువు, కడుపునొప్పి, నిద్రలేమి వంటి జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది.
Unsplash
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి అనేక సమ్మేళనాలను దాల్చినచెక్క కలిగి ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
Unsplash
ఈ నీటిని తాగడం వల్ల మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు. చర్మంలో మంటను తగ్గించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.
Unsplash
దాల్చిన చెక్క నీటిలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే ప్రోయాంతోసైనిడిన్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పానీయం యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది.
Unsplash
పడుకునే ముందు దాల్చిన చెక్క పానీయం తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నమ్ముతారు.
Unsplash
దాల్చిన చెక్క నీళ్లు తాగడం కారణంగా క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఇందులో యాంటీ క్యాన్సర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగిస్తాయి.
Unsplash
డిజిటల్ డీటాక్స్ : రోజంతా స్క్రీన్స్‌కి అతుక్కుపోతున్నారా? ఇలా రిఫ్రెష్ అవ్వండి..