Flaxseeds for Weight loss: బరువు తగ్గేందుకు అవిసె గింజలను ఎలా తీసుకోవచ్చు?
04 December 2024, 8:30 IST
- Flaxseeds for Weight loss: బరువు తగ్గాలనుకునే వారికి అవిసె గింజలు చాలా ఉపయోగపడతాయి. అయితే, వీటిని ఎలా తీసుకోవాలా అని చాాలా మంది సందేహిస్తుంటారు. డైట్‍లో ఎలా యాడ్ చేసుకోవాలా అని ఆలోచిస్తుంటారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Flaxseeds for Weight loss: బరువు తగ్గేందుకు అవిసె గింజలను ఎలా తీసుకోవచ్చు?
బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు సరైన డైట్, వర్కౌట్స్ క్రమంగా తప్పకుండా పాటించాలి. డైట్‍లో కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే మరింత వేగంగా ఫలితాలు ఉంటాయి. ‘అవిసె గింజలు’ (ఫ్లాక్స్ సీడ్స్) రెగ్యులర్‌గా తీసుకుంటే వెయిట్ లాస్ జర్నీకి ఎంతో ఉపయోగపడతాయి. బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
అవిసె గింజల్లో ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్లతో పాటు ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్స్, మినరళ్లను ఇవి మెండుగా కలిసి ఉంటాయి. దీంతో శరీరానికి పోషకాలు అందించడంతో పాటు బరువు తగ్గేందుకు అవిసె గింజలు చాలా ఉపకరిస్తాయి. వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు వీటిని ఎలా తీసుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
బరువు తగ్గేందుకు అవిసె గింజలు
అవిసెగింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి. శరీలంలో కొలెస్ట్రాల్‍ను, ఇన్‍ఫ్లమేషన్‍ను తగ్గిస్తాయి. ఈ గింజల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. జీర్ణక్రియను వేగవంతం చేయగలవు. ఆకలిని నియంత్రిస్తాయి. అవిసె గింజల్ల ప్రోటీన్ పుష్కలంగా.. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇలా బరువు తగ్గేందుకు అవిసె గింజలు తోడ్పడతాయి.
అవిసె గింజలను ఎలా తీసుకోవచ్చంటే..
నేరుగా..: అవిసె గింజలను నేరుగా కూడా తినవచ్చు. సన్నటి మంటపై ఫ్రై చేసుకొని కూడా తీసుకోవచ్చు.
అవిసె గింజల టీ: సాధారణ టీ బదులు అవిసె గింజలు టీ తాగితే బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ముందుగా ఓ గిన్నెల నీళ్లను మరిగించాలి. దాంట్లో ఓ టేబుల్ స్పూన్ అవిసె గింజల పొడి, కాస్త యాలకులు వేయాలి. ఆ తర్వాత సుమారు 5 నిమిషాలు బాగా మరిగించాలి. ఆ తర్వాత మంట ఆపేసి.. ఆ టీని వడగట్టుకోవాలి. రుచికి సరిపడా తేనె లేకపోతే నిమ్మరసం అయినా కలుపుకోవచ్చు.
పెరుగుతో..: పెరుగు, యగర్ట్‌తో కలిపి అవిసె గింజలను తింటే బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. కప్ పెరుగు లేదా యగర్ట్‌తో కలిపి అవిసె గింజలను నేరుగా తినేయవచ్చు. వీటిని సులువుగా తినేందుకు ఇదో మార్గం.
అవిసె నీరు: అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి.. ఉదయానే పరగడుపున తాగాలి. ఓకప్ నీటిలో సుమారు 3 టేబుల్‍స్పూన్‍ల అవిసె గింజలు వేసినా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని వడగడ్డి తాగేయాలి. గింజల్లోని సారమంతా నీటిలోకి దిగి ఉంటుంది.
స్మూతీలు, సలాడ్లలో..: మీరు తయారు చేసుకునే పండ్లు, కూరగాయల స్మూతీల్లో అవిసె గింజలను యాడ్ చేసుకోవచ్చు. దీని వల్ల వాటి పోషక విలువలు మరింత పెరుగుతాయి. ఎక్కుసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉండేలా అవిసె గింజలు చేయగలవు. సలాడ్లలో ఈ గింజలను వేసుకొని తినొచ్చు.