తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rakhi 2024: దూరప్రాంత తోబుట్టువులతో రాఖీ ఇలా జరుపుకోండి.. పండగ ఆనందాన్ని పెంచే ఫన్నీ ఐడియాలు

Rakhi 2024: దూరప్రాంత తోబుట్టువులతో రాఖీ ఇలా జరుపుకోండి.. పండగ ఆనందాన్ని పెంచే ఫన్నీ ఐడియాలు

18 August 2024, 10:30 IST

google News
  • Rakhi 2024: రక్షా బంధన్ అనేది తోబుట్టువుల వేడుక. ఈ సంతోషకరమైన రోజును జరుపుకోకుండా మీరుంటున్న దూరం మిమ్మల్ని వేరు చేయకూడదు. దానికోసం దూరంగా ఉన్న తోబుట్టువులతో కూడా ఈ రాఖీ వేడుకలు ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేసుకునే మార్గాలున్నాయి. పండగను ప్రత్యేకంగా మార్చే ఆ ఐడియాలేంటో చూడండి.

రాఖీ వేడుకలు
రాఖీ వేడుకలు

రాఖీ వేడుకలు

రాఖీ రోజున ఎంత దూరంలో ఉన్నాసరే తోబుట్టువులు తప్పకుండా కలుసుకుంటారు. చేతికి రాఖీ కట్టించుకుంటారు. కానీ చదువుల వల్లనో, ఉద్యోగం వల్లనో దూర ప్రాంతాలకు వెళ్తే వాళ్లను ఈ పండగ రోజు కలుసుకోకపోవడం వీలుకాకపోవచ్చు. అలాని రాఖీ పండగ ఆనందాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. దూరంగా ఉన్నా దగ్గరే ఉన్నట్లు అనిపించేలా ఈ పండగను ఎలా జరుపుకోవచ్చో చూడండి.

వర్చువల్ రాఖీ వేడుక

వేడుకలను జరుపుకోడానికి ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసేలా సాంప్రదాయ దుస్తులు ధరించండి. మీకు కూర్చున్న ప్రదేశాన్ని కాస్త ప్రత్యేకంగా డెకరేట్ చేయండి. దాంతో కేవలం వీడియో కాల్‌లో ఉన్నామని గుర్తు రాకుండా ఉంటుంది. రాఖీ ముహూర్తం సమయంలో మీరు పంపిన రాఖీ సోదరుడిని కట్టుకోమని చెప్పండి. మీ ముందు రాఖీ తాలి, స్వీట్లను సిద్దం చేసి పెట్టుకోండి. అలా వర్చువల్‌గా వారి నోట్లో మిఠాయి పెట్టిన అనుభూతి పొందేయండి.

సరదా పవర్ పాయింట్స్

మీ ఇద్దరి అందమైన అనుభూతులను గుర్తుచేసే ఫొటోలు, వీడియోలు కొన్ని పవర్ పాయింట్ రూపంలో ప్రెజెంట్ చేయండి. సిల్లీ ఫోటోలతో స్లైడ్ షోలు క్రియేట్ చేసుకోండి. జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మీ ముఖం మీద నవ్వులు పూయడం గ్యారంటీ. మీ ముఖ్యమైన జ్ఞాపకాలను గుర్తు చేసే ఫొటోలను మంచి సాంగ్ పెట్టి ఎడిటి చేసి ఒక సినిమా లాగా తయారు చేశారంటే ఎన్ని సార్లు చూసి మురిసిపోతారో లెక్కేలేదు..

వాచ్ పార్టీ

చిన్నప్పటి నుంచి మీరిద్దరూ కలిసి చూసిన ఏదైనా సినిమా ఇప్పుడు వర్చువల్ గా ఇద్దరూ కలిసి చూడండి. దీంతో తప్పకుండా మీ మధురానుభూతులు గుర్తుకొస్తాయి. ఎంత దూరంలో ఉన్నా కలిసి సినిమా చూశామనే అనుభూతీ దొరుకుతుంది.

ఆటలు

తోబుట్టువులంటేనే ప్రతి విషయంలో అవసరం లేకపోయినా పోటీ పడేవాళ్లు. గొడవ పడేవాళ్లు. మీ ఇద్దరికీ ఆటలంటే ఇష్టం ఉంటే, ఇదివరకటిలా మళ్లీ గొడవలు పడాలనుకుంటే ఆన్‌లైన్ లోనే మల్టీ ప్లేయర్ ఆటలు ఆడండి. సాయంత్రం అంతా దానికే కేటాయించండి. ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, తిట్టుకోవడంతో అలా ఆట సాగిపోతుంది. దూరంతో సంబంధం లేకుండా హాయిగా గడపడానికి , కొత్త జ్ఞాపకాలను సృష్టించడానికి ఈ ఆటల సాయంత్రమే సరైన మార్గం.

టీ పార్టీ

తోబుట్టువులు మంచి స్నేహితుల్లా ఉంటారు. వీళ్లిద్దరి మధ్య ఎవరికీ తెలియన రహస్యాలుంటాయి. అందరి గురించి వీళ్లిద్దరికీ అభిప్రాయాలుంటాయి. గుసగుసలూ ఉంటాయి. ఇవన్నీ మళ్లీ ఆస్వాదించాలింటే వర్చువల్ టీ పార్టీ చేసుకోవాల్సిందే. స్క్రీన్ ముందు టీ పట్టుకుని ఇద్దరూ కూర్చోండి. టీ ఆస్వాదిస్తూ మీ ముచ్చట్లు మొదలు పెట్టేయండి. మీకు తెలీకుండానే చాలా సమయం అలా గడిపేస్తారు చూడండి.

 

తదుపరి వ్యాసం