తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baal Aadhar : బాల ఆధార్ ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ ఏంటి?

Baal Aadhar : బాల ఆధార్ ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ ఏంటి?

Anand Sai HT Telugu

04 March 2024, 9:30 IST

google News
    • Baal Aadhar Card : భారతీయులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే పిల్లల కోసం ప్రత్యేకంగా బాల ఆధార్ కూడా అప్లై చేసుకోవాలి. దీనిని బ్లూ ఆధార్ అని కూడా అంటారు.
పిల్లలకు ఆధార్ ఎలా పొందాలి
పిల్లలకు ఆధార్ ఎలా పొందాలి (Unsplash)

పిల్లలకు ఆధార్ ఎలా పొందాలి

దేశంలో నివసించే ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డ్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇంతకుముందు ఇది చిరునామా, పుట్టిన తేదీ కార్డుగా ఉండేది. ఇప్పుడు అది KYC రికార్డుగా మారింది. ఇప్పుడు ఆధార్ ఉంటేనే ఏదైనా. ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్, వ్యాపారం సహా చాలా చోట్ల ఆధార్ కార్డును ఇప్పుడు తప్పనిసరి వినియోగిస్తున్నారు. ఇంతకుముందు పెద్దలకు మాత్రమే ఆధార్ ఉండేది. పుట్టిన పిల్లలు కూడా ఆధార్ కార్డు పొందాలని రూల్స్ తీసుకొచ్చారు. దీనిని బ్లూ ఆధార్ లేదా బాలా ఆధార్ అని కూడా అంటారు. ఇంతకీ చిన్నారులకు ఆధార్ కార్డు ఎలా అప్లై చేయాలి?

ఆధార్ కార్డ్.. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా కేటాయించబడిన ప్రత్యేకమైన 12-అంకెల సంఖ్య. UIDAI వెబ్‌సైట్ ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నంబర్‌ను తెలియజేయడానికి నీలి అక్షరాలతో ముద్రించిన 'బాల్ ఆధార్'ను ప్రవేశపెట్టారు. ఇది తమ బిడ్డకు ఐదేళ్లు పూర్తయిన తర్వాత బయోమెట్రిక్ ఆధార్ పొందడానికి సహాయం చేస్తుంది. అప్పుడు కూడా అదే నంబర్ కొనసాగుతుంది.. కానీ కార్డు మారుతుంది.

ఆధార్ చట్టం, 2016లోని సెక్షన్ 3(1) ప్రకారం ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియలో జనాభా సమాచారం, బయోమెట్రిక్ సమాచారాన్ని సమర్పించడం ద్వారా పిల్లలతో సహా ప్రతి నివాసి ఆధార్ నంబర్‌ను పొందడానికి అర్హులు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల నమోదు కోసం, బయోమెట్రిక్ సమాచారం సేకరించరు. పేరు, చిరునామా, ఫోటో సమాచారం మాత్రమే సేకరిస్తారు. పిల్లల ఆధార్ నంబర్, తల్లిదండ్రుల ఆధార్‌తో లింక్ చేస్తారు.

బాల్ ఆధార్ కి పిల్లల బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, బయోమెట్రిక్‌లు తీసుకోదు. ఐదేళ్లు దాటిన తర్వాత వారి ఆధార్ కార్డును మార్చుకోవాలి. అప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటుంది.

బాల ఆధార్ ఎలా పొందాలి?

అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెబ్‌సైట్‌ను సందర్శించండి(https://uidai.gov.in/). నా ఆధార్‌పై క్లిక్ చేయండి, బుక్ అపాయింట్‌మెంట్ పై క్లిక్ చేయండి.

చిల్డ్రన్స్ ఆధార్ ఎంచుకోండి. కొత్త ఆధార్‌ని ఎంచుకుని, మీ మొబైల్ నంబర్, సెక్యూరిటీ కోడ్ (క్యాప్చా) నమోదు చేయండి.

ఇంటి పెద్దకు లింక్ కింద, చైల్డ్ (0-5 సంవత్సరాలు) ఎంచుకోండి. మీ పిల్లల వివరాలను పూరించండి, పేరు, పుట్టిన తేదీ, చిరునామాతో సహా మీ పిల్లల సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయండి.

మీకు అవసరమైన పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. అంటే మీ పిల్లల జనన ధృవీకరణ పత్రం, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్. మీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి.

సమీపంలోని ఆధార్ సేవా కేంద్రంలో అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంచుకోండి. అవసరమైన పత్రాలను ఉంచిన తర్వాత, ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లండి.

అక్కడ మీరు కొన్ని ఫారమ్‌లను పూరించాలి. దీని తర్వాత వారికి దరఖాస్తు ఇవ్వండి. కొన్ని రోజుల తర్వాత, మీ పిల్లల ఆధార్ కార్డు మీకు చేరుతుంది.

తదుపరి వ్యాసం