Aadhaar Lock/Unlock Process : ఆధార్ బయోమెట్రిక్ లాక్, అన్ లాక్ చేయడం ఎలా? అన్ లాక్ డిజేబుల్ విధానం ఎలా?
Aadhaar Lock/Unlock Process : ఆధార్ కార్డులో అత్యంత కీలకమైంది బయోమెట్రిక్ సమాచారం. సైబర్ నేరాల బారిన పడుకుండా బయోమెట్రిక్ ను లాక్/ అన్ లాక్ చేసుకోవచ్చు. తరచూ బయోమెట్రిక్ వినియోగించే వాళ్లు అన్ లాక్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ విధానం గురించి తెలుసుకుందాం.
Aadhaar Lock/Unlock Process : భారతదేశంలో ఆధార్ అన్నింటికీ ఆధారంలా మారింది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) భారతదేశంలోని ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసుకుని ఒక యునిట్ నెంబర్ ఇస్తుంది. దీనినే ఆధార్ నంబర్(Aadhaar) అని పిలుస్తారు. ఆధార్ నమోదు సమయంలో వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్, ఐరీస్ ఇలా అన్నింటిని రికార్డు చేస్తారు. ఆధార్ ప్రక్రియలో బయోమెట్రిక్ చాలా కీలకం. సైబర్ నేరాలు పెరిగిపోవడంతో బయోమెట్రిక్ లాకింగ్ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చింది యూఐడీఏఐ. mAadhaar యాప్ లేదా https://uidai.gov.in/ వెబ్ సైట్ ద్వారా బయోమెట్రిక్ లాక్/అన్ లాక్(Aadhaar Lock/Unlock Process ) చేసుకోవచ్చు. మీకు అవసరమైన సమయంలో అన్ లాక్ చేసుకునేందుకు mAadhaar యాప్ సులభంగా ఉంటుంది. ఇందులో ఓటీపీ ఆధారిత అన్ లాక్ సిస్టమ్ ఉంటుంది. అన్ లాక్ చేసిన 9 నిమిషాల్లో తిరిగి ఆటోమేటిక్ గా బయోమెట్రిక్ లాక్ అవుతుంది.
mAadhaar యాప్ లో బయోమెట్రిక్ లాక్/అన్ లాక్ చేయడం ఎలా?
mAadhaar అనేది యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అభివృద్ధి చేసిన మొబైల్ యాప్. ఆధార్ కార్డు కలిగిన వారు ఈ యాప్ ద్వారా తమ మొబైల్ లో ఆధార్ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో మీ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ వివరాలు యాడ్ చేసుకోవచ్చు. మీ బయోమెట్రిక్ లాక్/అన్ లాక్(Aadhaar Lock/Unlock Process ) చేసుకునే సౌలభ్యం ఉంటుంది. దీంతో యుఐడీఏఐ కల్పించే ఇతర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Step 1 : గూగుల్ ప్లే స్టోర్/యాపిల్ యాప్ స్టోర్ లో mAadhaar యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
Step 2 : mAadhaar యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
Step 3 : ఆధార్ నెంబర్ నమోదు చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
Step 4 : తదుపరి లాగిన్ లకు కూడా ఓటీపీ అవసరం అవుతుంది. లాగిన్ అయ్యాక mAadhaar యాప్ ను యాక్సెస్ చేసేందుకు పిన్ సెట్ చేసుకోవచ్చు.
Step 5 : మీ ఆధార్ కార్డు, వ్యక్తిగత సమాచారం అన్ని కనిపిస్తాయి.
Step 6 : బయోమెట్రిక్ లాక్/ అన్ లాక్ చేయడం కోసం mAadhaar యాప్ ప్రత్యేకమైన ఫీచర్ ఉంటుంది. బయోమెట్రిక్ లాక్ చేసేందుకు 'Biometrics lock' ఫీచర్ పై క్లిక్ చేయండి. మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత బయోమెట్రిక్ లాక్ అవుతుంది.
Step 7 : బయోమెట్రిక్ అన్ లాక్ కోసం mAadhaar యాప్ లో My Aadhaar లో 'Biometrics Unlock' ఫీచర్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన 9 నిమిషాల పాటు బయోమెట్రిక్ అన్ లాక్ లో ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా లాక్ అవుతుంది.
బయోమెట్రిక్ పర్మినెంట్ అన్ లాక్ కోసం ఇలా చేయండి?
mAadhaar యాప్ లో అన్ లాక్ ఆప్షన్ ద్వారా కొన్ని నిమిషాల పాటు మాత్రమే బయోమెట్రిక్ అన్ లాక్ అవుతుంది. తరచూ బయోమెట్రిక్ వినియోగించేవాళ్లు..పర్మినెంట్ గా బయోమెట్రిక్ అన్ లాక్ చేసుకునేందుకు యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా అన్ లాక్ చేసుకోవచ్చు. ఆధార్ డేటాను తరచుగా యాక్సెస్ చేయవలసి వస్తే అన్ లాక్ చేయడం ప్రతిసారీ సమస్య కావచ్చు. ఆధార్ బయోమెట్రిక్ డేటా పర్మినెంట్ గా అన్ లాక్ చేసేందుకు 'డిజేబుల్'(Disable Unlock) ఆప్షన్ ఎంచుకోవచ్చు.
Step 1 : మీ బయోమెట్రిక్ ను శాశ్వతంగా అన్ లాక్ చేయడానికి యూఐడీఏఐ వెబ్ సైట్ లో మాత్రమే చేయగలరు. mAadhaar యాప్ డిజేబుల్ ఆప్షన్ ఉండదు.
Step 2 : UIDAI పోర్టల్ https://uidai.gov.in/ లో మీ ఆధార్ నంబర్ ఉపయోగించి లాగిన్ చేయండి.
Step 3 : హోం పేజీలో My Aadhaar పై క్లిక్ చేయండి. ఆధార్ సేవల నుంచి లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్‌పై క్లిక్ చేసి ఈ సేవలు పొందవచ్చు.
Step 4 : మీరు లాక్‌ని శాశ్వతంగా నిలిపివేసేందుకు డిజేబుల్ లాకింగ్ ఫీచర్‌పై క్లిక్ చేయండి. మీరు మళ్లీ లాక్ చేసే వరకు మీ ఆధార్ బయోమెట్రిక్‌లు శాశ్వతంగా అన్ లాక్ లో ఉంటుంది.
సంబంధిత కథనం