తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Decor For Positivity: ఇంటిముందు ఇవి ఉంచితే.. పాజిటివిటీ పెరుగుతుంది..

home decor for positivity: ఇంటిముందు ఇవి ఉంచితే.. పాజిటివిటీ పెరుగుతుంది..

22 May 2023, 13:00 IST

  • home decor for positivity: ఇంటికి రాగానే ప్రశాంతంగా అనిపించాలి. పాజిటివ్ వ్రైబ్రేషన్స్ రావాలి. కొన్ని మార్పులు చేస్తే ఆ ఆనందం మీసొంతం. అవేంటో చూడండి. 

ఇంటి అలంకరణ
ఇంటి అలంకరణ (Unsplash)

ఇంటి అలంకరణ

ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటే రాగానే రోజు మొత్తం పని వల్ల అలసట సగం తగ్గిపోతుంది. కొన్ని అలంకరణ వస్తువులు, చిన్న మార్పులు, రంగులు, వెలుతురుతో ఆ మార్పు చాలా సులభంగా తీసుకురావచ్చు. అదెలాగో చూడండి.

1. ఆర్ట్ వర్క్:

  • ఇంటి ముఖ్య ద్వారం దగ్గర ఒక బుద్దుని విగ్రహాన్ని పెట్టండి. దానివల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు.
  • ఒక తొట్టెలో నీళ్లు నింపి అందులో పూల రెక్కలు వేసి గది ముందు పెట్టండి. ఇది పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది.
  • గాలికి చప్పుడు చేసే విండ్ షైమ్స్ ఆరు నుంచి ఎనిమిది రాడ్స్ ఉన్నవి వేళాడదీయండి. వాటి చప్పుడు వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

2. అవసరం లేని వస్తువులు:

ఇంట్లోకి రాగానే కనిపించే మొదటి గదిని చాలా శుభ్రంగా ఉంచాలి. ప్రవేశ ద్వారంలో ఎలాంటి వస్తువులు ఉంచకండి. కేవలం అవసరమైన, వీలైనన్ని తక్కువ వస్తువులతో దాన్ని అలంకరించండి. అలాగే కిచెన్ స్లాబ్, కాఫీ టేబుల్, డైనింగ్ టేబుల్ మీద పనికిరాని వస్తువులు ఉంచకండి.

3. సహజ వెలుతురు:

కిటికీలు తెరిచి ఉంచడం వల్ల గాలి , వెలుతురు సరిగ్గా ఉంటాయి. సూర్యరశ్మి ఇంట్లో పడటం వల్ల విటమిన్ డి దొరకడమే కాదు, ఇది మనం ఆనందంగా ఉండేలా చేస్తుంది. చీకటి గదిలో లైట్లు వేసుకుని పని చేయడం కన్నా సహజ వెలుతురులో చేస్తే పనితనం ఎక్కువగా ఉంటుందట.

4. మొక్కలు, పూలు:

ఇంటి లోపల కొన్ని రకాల మొక్కలు పెంచడం వల్ల గాలి నాణ్యత పెరుగుతుంది. అందంగా కనిపిస్తుంది. మొక్కల వల్ల తాజాగా అనిపిస్తుంది. లేదా తాజా పూలను గదిలో ఫ్లవర్ వేజ్ లలో అలంకరించండి. లేదా లిల్లీ, ఆర్కిడ్స్ లాంటి చిన్న పూల మొక్కలేవైనా పెంచొచ్చు. వాటిని వెలుతురు బాగా తగిలే కిటికీల దగ్గర పెడితే చాలు.

5. రంగులు:

సోఫా మీద రంగు రంగుల దిండ్లు ఉంచండి. లేదా బెడ్ మీద అందంగా ఉండే క్విల్ట్ ఉంచండి. ఇది ఒక కొత్త లుక్ తీసుకొస్తుంది. రంగుల ప్రభావం మనసు మీద ఎక్కువగా ఉంటుంది. లీవింగ్ రూంలో బీజ్, క్రీమ్, ఫ్లోరల్ వైట్ లాంటి లేత రంగుల్ని ఎంచుకోవాలి. ఈ రంగులు ప్రశాంతతను, అందాన్ని తీసుకొస్తాయి.

6. పరిమళాలు:

మంచి వాసన మంచి మనసుకు కారణం. వాసనను బట్టి మన మూడ్ లో మార్పు వస్తుందట. కాబట్టి ఏదైనా ఎసెన్షియల్ నూనెను వాడొచ్చు. వీలైతే డిఫ్యూజర్ వాడండి. ల్యావెండర్, రోస్ మెర్రీ లాంటి వాసనలు తాజాదనాన్ని తీసుకొస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం