తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nokia T10 Tablet । ఆకర్షణీయమైన టాబ్లెట్ ఫోన్.. అందుబాటు ధర, ఫీచర్లు ఇవే!

Nokia T10 Tablet । ఆకర్షణీయమైన టాబ్లెట్ ఫోన్.. అందుబాటు ధర, ఫీచర్లు ఇవే!

HT Telugu Desk HT Telugu

28 September 2022, 14:38 IST

    • నోకియా నుంచి రూ. 12 వేల బడ్జెట్ ధరలో Nokia T10 Tablet  కొనుగోలు చేయవచ్చు. ఫోన్ విడుదలయింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది, ఫీచర్స్ ఏమున్నాయో చూడండి.
Nokia T10 Tablet
Nokia T10 Tablet

Nokia T10 Tablet

HMD గ్లోబల్ భారత మార్కెట్లో తమ టాబ్లెట్ లైనప్‌ను విస్తరించింది. తాజాగా Nokia T10 Tablet పేరుతో ఒక ఎంట్రీ-లెవల్ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇది Wi-Fi అలాగే LTE+Wi-Fi డ్యుయల్ కనెక్టివిటీ వేరియంట్‌లలో వచ్చింది, అయితే ప్రస్తుతం భారత మార్కెట్లో Wi-Fi మోడల్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇక, స్టోరేజ్ ఆధారంగా కూడా ఇది రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. గరిష్ట ఇంటర్నల్ స్టోరేజ్ 64 GB గా ఉంది. అయితే మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 512GB వరకు స్టోరేజ్ విస్తరించుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Sweetcorn Dosa: స్వీట్ కార్న్ దోశ రెసిపీ, ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు

Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

సరికొత్త నోకియా T10 టాబ్లెట్ Unisoc T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 800 x 1280 (HD+) రిజల్యూషన్, 450 nits పీక్ బ్రైట్‌నెస్ లెవెల్ కలిగిన 8-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. అలాగే ఈ టాబ్లెట్ రెండవ స్క్రీన్‌ను కూడా కలిగి ఉంది, దీనిని PC లేదా ల్యాప్‌టాప్‌కు ప్రతిబింబించేలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 5,250 mAh బ్యాటరీ ఇచ్చారు, టాబ్లెట్ వినియోగానికి ఈ బ్యాటరీ తక్కువ అనే చెప్పాలి. ఇంకా ఈ టాబ్లెట్‌లో ఇందులో OZO ప్లేబ్యాక్ ఉంది. ఆడియో కోసం, డ్యుయల్-స్టీరియో-స్పీకర్‌లు ఉన్నాయి.

ఇంకా Nokia T10 Tabletకి సంబంధించి మరిన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమున్నాయి? ధర ఎంత? తదితర వివరాలు ఈ క్రింద తెలుసుకోండి.

Nokia T10 Tablet ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 8-అంగుళాల IPS LCD డిస్‌ప్లే
  • 3GB/4GB RAM, 32GB/64GB స్టోరేజ్ సామర్థ్యం, మైక్రో SD కార్డ్ స్లాట్
  • Unisoc T606 ప్రాసెసర్‌ ప్రాసెసర్
  • వెనకవైపు 8MP కెమెరా, ముందు భాగంలో 2MP సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5250 mAh బ్యాటరీ సామర్థ్యం, 20W ఛార్జింగ్
  • 3GB+32GB వేరియంట్ కోసం ధర, రూ. 11,799/-
  • 4GB+64GB వేరియంట్ కోసం ధర, రూ. 12,799/-

ఇతర ఫీచర్లలో వైర్డు ఆడియో అవుట్ కోసం 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, ఇన్‌బిల్ట్ GPS ఉన్నాయి.

సరికొత్త నోకియా T10 (Wi-Fi) ప్రత్యేకంగా Amazon, Nokia ఆన్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

తదుపరి వ్యాసం