Nokia 8120 4G । నోకియా నుంచి ఆకర్షణీయమైన ఫీచర్ ఫోన్.. ఫీచర్లు ఇవే!-nokia 8120 4g feature phone launched check price details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Nokia 8120 4g । నోకియా నుంచి ఆకర్షణీయమైన ఫీచర్ ఫోన్.. ఫీచర్లు ఇవే!

Nokia 8120 4G । నోకియా నుంచి ఆకర్షణీయమైన ఫీచర్ ఫోన్.. ఫీచర్లు ఇవే!

HT Telugu Desk HT Telugu
Aug 02, 2022 06:37 PM IST

నోకియా నుంచి Nokia 8120 4G అనే ఫీచర్ ఫోన్ విడుదలైంది. చూడచక్కని రంగుల్లో ఎంతో ఆకర్షణీయంగా ఈ ఫోన్ ఉంది. ఫీచర్లు, ధర ఇతర వివరాలను చూడండి.

Nokia 8120 4G
Nokia 8120 4G

మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌లు విడుదలవుతున్న నేటి కాలంలోనూ నోకియా నుంచి ఫీచర్ ఫోన్లు విడుదలవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ వచ్చాక దాదాపు వివిధ రకాలు, ఆకృతుల్లో వచ్చే ఫీచర్ ఫోన్లు మొత్తానికే కనుమరుగయ్యాయి. అయితే నోకియా మాత్రం అడపదడపా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూనే, మరోవైపు ఫీచర్ ఫోన్లను తీసుకువస్తుంది. గత జూలై నెలలో 2660 ఫ్లిప్ ఫోన్, 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో ఫోన్లను ప్రవేశపెట్టిన HMD గ్లోబల్.. తాజాగా నోకియా బ్రాండ్ నుంచి మరొక సరికొత్త ఫీచర్ ఫోన్ Nokia 8120 4Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది 1999లో పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా ప్రవేశపెట్టిన లెజెండరీ నోకియా 8210కి గౌరవ సూచకంగా విడుదల చేసింది.

Nokia 8120 4G ఫోన్ పాతకాలపు ఫీచర్ ఫోన్ నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్ కలిగి ఉంది. రెట్రో మోడల్ ఫోన్ కోరుకునేవారికి, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలనుకునే వారికి ఈ ఆకర్షణీయమైన ఫోన్ మంచి ఛాయిస్ అవుతుంది. ఇంకా నోకియా ఫోన్ల నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరి సరికొత్త Nokia 8120 4G ఫీచర్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఒకసారి చూసేయండి.

Nokia 8120 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 2.8-అంగుళాల QVGA డిస్‌ప్లే
  • 1GHz Unisoc T107 సింగిల్-కోర్ ప్రాసెసర్
  • 48MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ (మైక్రో SDతో 32GB వరకు విస్తరించుకోవచ్చు)
  • డ్యూయల్ సిమ్ (నానో + నానో)
  • S30+ ఆపరేటింగ్ సిస్టమ్
  • VGA వెనుక కెమెరా
  • 1450mAh బ్యాటరీ

ఇంకా 4G VoLTE, బ్లూటూత్ 5.0, మైక్రో USB, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్, వైర్‌లెస్ FM రేడియో, MP3 ప్లేయర్, టార్చ్ లైట్, గేమ్‌లాఫ్ట్ గేమ్‌లు, ఆరిజిన్ డేటా గేమ్‌లతో ప్రీలోడెడ్‌గా వస్తుంది.

నోకియా 8120 4G ధర రూ. 3,999/- . ఈ ఫోన్ డార్క్ బ్లూ, రెడ్ కలర్స్‌లో వస్తుంది. దీనిని Amazon.in అలాగే Nokia ఇండియా ఆన్‌లైన్ స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్