తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samsung Galaxy Tab A7 Lite టాబ్లెట్‌పై డిస్కౌంట్, రూ. 9 వేలకే సొంతం చేసుకోండిలా

Samsung Galaxy Tab A7 Lite టాబ్లెట్‌పై డిస్కౌంట్, రూ. 9 వేలకే సొంతం చేసుకోండిలా

HT Telugu Desk HT Telugu

04 August 2022, 16:57 IST

    • శాంసంగ్ కంపెనీ పలు గాడ్జెట్లపై డిస్కౌంట్ ధరలను, ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా Samsung Galaxy Tab A7 Lite టాబ్లెట్ ధరను తగ్గించింది. వివరాలు చూడండి.
Samsung Galaxy Tab A7 Lite
Samsung Galaxy Tab A7 Lite

Samsung Galaxy Tab A7 Lite

టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ వరుసగా తమ ఉత్పత్తులపై తగ్గింపును ప్రకటిస్తోంది. తాజాగా Galaxy Tab A7 Lite టాబ్లెట్ ఫోన్ ధరను తగ్గించింది. ఇటీవల కాలంలో శాంసంగ్ Watch 4, గెలాక్సీ A13, గెలాక్సీ A22 5G వంటి స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. కొత్త ప్రొడక్ట్స్ విడుదల చేస్తున్న సందర్భంలో ఈ విధమైన తగ్గింపులు ప్రకటిస్తూ శాంసంగ్ కంపెనీ తమ సేల్స్ పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు?

Mothers day 2024 Gift Ideas: మదర్స్ డే రోజు మీ అమ్మకు మర్చిపోలేని ఇలాంటి అందమైన బహుమతిని ఇవ్వండి

Carrot Milkshake: మండే ఎండల్లో టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ ఇది, ఎంతో ఆరోగ్యం కూడా

World lupus day 2024: శరీరంలోని అన్ని అవయవాలపై దాడి చేసే వ్యాధి లూపస్, ఇదొక విచిత్రమైన ఆరోగ్య సమస్య

Samsung Galaxy Tab A7 Lite టాబ్లెట్ భారత మార్కెట్లో LTE అలాగే Wi-Fi అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. 4G LTE పాత ధర రూ.14,999 ఉండగా దీని ధరను రూ. 1000 తగ్గించి ఇప్పుడు రూ, 13,999కి అందిస్తుండగా.. Wi-Fi వేరియంట్ పాత ధర రూ.11,999 కాగా, దీనిపై కూడా ఆండ్రాయిడ్ టాబ్లెట్ ధర రూ. 1,000 తగ్గి ఇప్పుడు రూ. 11 వేలకు లభ్యమవుతోంది. అదనంగా SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు శాంసంగ్ రూ. 2,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. కేవలం నెలకు రూ. 998 చెల్లించి నో కాస్ట్ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రకారం Samsung Galaxy Tab A7 Liteను కేవలం రూ. 9 వేలకే సొంతం చేసుకోవచ్చు.

మరి ఈ టాబ్లెట్లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Samsung Galaxy Tab A7 Lite టాబ్లెట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 8.7-అంగుళాల WUXGA+ డిస్‌ప్లే
  • 3GB/4GB RAM, 32GB/64GB స్టోరేజ్ సామర్థ్యం+ మైక్రో SD కార్డ్ స్లాట్
  • మీడియాటెక్ హీలియో P22T ప్రాసెసర్
  • వెనకవైపు 8MP కెమెరా, ముందు భాగంలో 2MP సెల్ఫీ కెమెరా
  • ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5100 mAh బ్యాటరీ సామర్థ్యం, 15W ఛార్జింగ్

ఈ టాబ్లెట్‌ సిల్వర్, గ్రే, అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

టాపిక్