Healthy Smoothie Recipe : ఈ స్మూతీ తాగితే.. మీ ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు..
14 December 2022, 7:15 IST
- Healthy Smoothie Recipe for Breakfast : ఉదయాన్నే హెల్తీ ఫుడ్ తీసుకోవడం మంచి విషయమే. అయితే.. మీ ఆరోగ్యానికి మేలుచేసే, మీ బిజీ షెడ్యూల్‌ని మరింత ఈజీ చేసే.. టేస్టీ, హెల్తీ రెసిపీ ఇక్కడ ఉంది. మరి దీనిని ఎలాతయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెల్తీ స్మూతీ
Healthy Smoothie Recipe : యాపిల్, దానిమ్మ, పుచ్చకాయ వల్ల కలిగే బెనిఫిట్స్ అన్ని ఇన్నీ కాదు. ఇవి ఆరోగ్యానికి.. అందానికి.. బరువు తగ్గడంలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే వీటితో తయారు చేసే స్మూతీని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇది మంచి టేస్ట్‌ని కలిగి ఉంటుంది. పైగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే దీన్ని తీసుకోవడం వల్ల శరీరం లోపలి నుంచి డిటాక్స్ అవుతుంది. మరి ఈ స్మూతీని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* దానిమ్మ - 1/4 కప్పు
* అరటి - 1/2 కప్పు
* నీరు - 1 కప్పు
* ఆపిల్ - 1 కప్పు
* పుచ్చకాయ - 1/2 కప్పు
తయారీ విధానం
బ్లెండర్లో అరటి, దానిమ్మ, ఆపిల్, పుచ్చకాయ వేసి బ్లెండ్ చేయండి. దానిలో నీరు పోసి.. స్మూతీలాగా వచ్చేవరకు బ్లెండ్ చేయండి. అంతే టేస్టీ, హెల్తీ జ్యూసీ రెడీ.