Apple Cider Vinegar Benefits : రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచిదట..-consume apple cider vinegar for health benefits here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Apple Cider Vinegar Benefits : రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచిదట..

Apple Cider Vinegar Benefits : రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే.. ఆరోగ్యానికి మంచిదట..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 19, 2022 10:15 AM IST

Apple Cider Vinegar Benefits : రోజుకు ఓ యాపిల్ తింటే ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అలాగే రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నా.. మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి దీనిని ఎలా డైట్​లో కలిపి తీసుకోవాలి.. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆపిల్ సైడర్ వెనిగర్ బెనిఫిట్స్
ఆపిల్ సైడర్ వెనిగర్ బెనిఫిట్స్

Apple Cider Vinegar Benefits : యాపిల్ సైడర్ వెనిగర్​ను.. కొన్ని శతాబ్ధాలుగా.. అనేక రకాల ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. దీనిని పులియబెట్టిన ఆపిల్ రసం నుంచి తయారు చేస్తారు. ఇది ప్రధానంగా ఎసిటిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. పైగా పుల్లని వాసన, రుచిని కలిగి ఉంటుంది. అందుకే దీనిని తీసుకునేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపరు. కానీ దీనివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే.. తాగకుండా ఉండరు అనే చెప్పాలి.

యాపిల్ సైడర్ వెనిగర్‌ను బరువు తగ్గడానికి, హానికరమైన బ్యాక్టీరియాను నిరోధించడంలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఇవే కాకుండా వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది..

యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుందని పరిశోధకులు నిరూపించారు.

నిద్రపోయే ముందు సుమారు రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్​ను ఒక గ్లాసు నీటిలో కలపి తీసుకోవడం వల్ల మరుసటి రోజు ఉదయం.. రక్తంలో చక్కెరను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.

కానీ దీనిని ఉపయోగించేటప్పుడు కచ్చితంగా డైల్యూట్ చేసే తీసుకోవాలి. చిక్కగా ఉండేదానిని తీసుకుంటే ఇది పంటి ఎనామెల్‌ను నాశనం చేస్తుంది. అంతేకాకుండా అది మీ కడుపుని చికాకు పెడుతుంది.

బరువు తగ్గడానికి..

మూడు నెలల పాటు ప్రతిరోజూ రెండు టేబుల్‌స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల 1.7 కిలోల బరువు తగ్గుతామని పరిశోధనలు నిరూపించాయి. ఇది ఆకలి బాధలను తగ్గించి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిస్తుందని చెప్తారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర హెచ్చుతగ్గులను అదుపులో ఉంచి.. తద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

మీరు దీన్ని ఇంట్లో తయారుచేసిన మయోన్నైస్ లేదా సలాడ్ డ్రెస్సింగ్‌లకు జోడించడం ద్వారా మీ రోజువారీ ఆహారంలో భాగంగా కూడా చేసుకోవచ్చు.

చర్మ ఆరోగ్యానికై..

యాపిల్ సైడర్ వెనిగర్ మీ చర్మాన్ని రక్షిస్తుంది. చర్మం pH స్థాయిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. అలా మీ చర్మానికి రక్షణను అందిస్తుంది. పొడి చర్మం, తామర చికిత్స చేయడంలో ఇది అత్యంత ప్రభావవంతమైనది.

యాపిల్ సైడర్ వెనిగర్​ను పలుచగా చేసి.. టోనర్‌గా లేదా ఫేస్ వాష్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది మీ చర్మం నుంచి హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. చర్మంపై రక్షిత పొరను కూడా ఏర్పరుస్తుంది. మొటిమలు కలిగించే బ్యాక్టిరియాను చంపగలదని అధ్యయనాలు తెలిపాయి. కానీ.. దీనిపై మరింత పరిశోధన అవసరం.

బ్యాక్టీరియాను చంపడంలో..

యాపిల్ సైడర్ వెనిగర్ హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. బ్యాక్టీరియాతో సహా పలు వ్యాధికారకాలను దూరం చేస్తుంది. గోరు ఫంగస్, చెవి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఇది సహజ ఆహార సంరక్షణకారిగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. తద్వారా ఆహారం చెడిపోకుండా కాపాడుతుంది.

పీరియడ్స్ సమయంలో..

యాపిల్ సైడర్ వెనిగర్ ముఖ్యంగా మహిళలకు చాలా మంచిది. పీరియడ్స్‌ను నియంత్రించడంలో సహాయం చేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో పొటాషియం, కాల్షియం కూడా ఉన్నాయి. ఇవి గర్భాశయ కండరాలలో పీరియడ్స్ తిమ్మిరిని తగ్గిస్తాయి.

మీరు 16-ఔన్సుల గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ను యాపిల్ సైడర్ వెనిగర్​ను కలిపి తీసుకుంటే.. మెరుగైన ఫలితాలను పొందవచ్చు. పీసీఓఎస్ ఉన్న మహిళలు రాత్రి భోజనం చేసిన వెంటనే ఒక గ్లాసు నీటితో ఒక టేబుల్ స్పూన్ దీనిని కలిపి తీసుకోవడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు పొందారని అధ్యయనాలు చెప్తున్నాయి.

సంబంధిత కథనం