పీరియడ్స్‌పై అపోహలు.. వీటిని ఉపయోగిస్తే కన్యత్వం పోతుందా..?-alarming myths about periods we have to end now ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పీరియడ్స్‌పై అపోహలు.. వీటిని ఉపయోగిస్తే కన్యత్వం పోతుందా..?

పీరియడ్స్‌పై అపోహలు.. వీటిని ఉపయోగిస్తే కన్యత్వం పోతుందా..?

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 09:31 PM IST

Menstrual Cups: రుతుస్రావం మహిళల్లో పునరుత్పత్తి కోసం జరిగే సహజ ప్రక్రియ. అయితే నెలసరిపై ఇప్పటికే చాలా మందిలో అనేక ఆపోహాలు ఉన్నాయి. చాలా మందికి రుతుస్రావానికి సంబంధించిన జాగ్రత్తల గురించి కనీస అవగాహన కూడా ఉండటం లేదు. సమాజంలో పీరియడ్స్ సంబంధించి అనేక అపోహలు, మూఢనమ్మకాలు ఉన్నాయి.

Menstrual Cups
Menstrual Cups

పీరియడ్స్ అనేది మహిళలో జరిగే సాధారణ ప్రక్రియ. అయితే రుతుస్రావానికి సంబంధించి చాలా మందిలో అనేక అపోహలు ఉంటాయి. రుతుస్రావంపై అనేక మూఢనమ్మకాలు, అనవసరమైన లేని సామాజిక చట్టాలు వ్యాప్తిలో ఉన్నాయి. పీరియడ్స్ బాధపడుతన్న వారిని దూరంగా ఉంచడం.. ఏడు రోజుల పాటు గదిలో బంధించడం. చప్పగా ఉండే ఆహారాన్ని ఇవ్వడం. ఆ రోజుల్లో మిగిలిన కుటుంబ సభ్యుల కంటే బాధితుల పట్ల భిన్నంగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. ఇంటిలో ఊరగాయలను రుతుస్రావం ఉన్న స్త్రీలు ముట్టుకోకూడదని, వంటింట్లోకి ప్రవేశించరాదని, ఇతరులను ముట్టుకోరాదనే పలు నమ్మకాలుంటాయి. ఇవే కాకుండా ఆరోగ్యం విషయంలో కూడా పలు అపనమ్మకాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు చూద్దాం.

అపోహ సంఖ్య 1: అపరిశుభ్రంగా ఉన్నందున పీరియడ్స్ సమయంలో మొటిమలు వస్తాయి

పీరియడ్స్‌లో వచ్చే రక్తము అశుద్ధమైనదైని దీని కారణంగా మొటిమల వస్తాయని నమ్ముతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే, ఋతుస్త్రావంలో వచ్చే రక్తం కూడా శరీరంలో ప్రవహించే సాధారణ రక్తం వంటిదే. ఇక పీరియడ్స్ సమయంలో మొటిమల విషయానికొస్తే.. ఋతు చక్రంలో హార్మోన్లు హెచ్చుతగ్గులకు గురవుతాయి. పీరియడ్స్ ప్రారంభానికి ముందు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోతాయి, రి సేబాషియస్ గ్రంధులు ఎక్కువ సెబమ్‌ను స్రవిస్తాయి. ఈ జిడ్డు పదార్థం గ్రంధుల స్రావముకు అడ్డుపడి బ్రేక్అవుట్లకు కారణమవుతుంది. దీంతో మెటిమలు వస్తాయి. అంతేకానీ అపరిశుభ్రం వల్ల కాదు.

అపోహ సంఖ్య 2: పీరియడ్స్ సమయంలో PMS (ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్)

రుతుక్రమం ప్రారంభమయ్యే ముందు సహజంగా ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ ( PMS) వస్తుంది. ఇది శరీరంలోని హార్మోన్ల మార్పులకు సంబంధించినవి. వీటి వల్ల పీరియడ్స్ సమయంలో మానసిక ఆందోళన, కడుపు ఉబ్బరం, పాదాల వాపు, వికారం, నిరాశ, చిరాకు వంటివి వస్తుంటాయి. ఋతుక్రమంలో నిద్ర లేమి, ఆకలి కూడా ఉండదు.

అపోహ సంఖ్య 3: బుతు చక్రం సమయంలో గర్భం రాదు

ఋతు చక్రం దాదాపు 28 రోజులు ఉంటాయి, కొన్ని చక్రాలు 21 రోజుల కంటే తక్కువగా ఉంటాయి. అండోత్సర్గము జరిగినప్పుడు ఈ కాల చక్రాలు ప్రభావం చూపుతాయి. దీంతో భార్యాభర్తలు కలిసినప్పుడు అండం ఫలదీకరణం చెంది.. ఫలితంగా గర్భం వస్తుంది. అంతేకాకుండా, ఋతుస్రావం సమయంలో కండోమ్ ఉపయోగించకుండా లైంగిక సంబంధం కలిగి ఉంటే, ఈ సమయంలో సంభవించే హార్మోన్ల మార్పుల కారణంగా HIV లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్‌తో సహా లైంగిక సంక్రమణ సంక్రమణ (STI) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అపోహ సంఖ్య 4: అందరి మహిళల్లో పీరియడ్స్

స్త్రీ రూపం కలిగిన అందరిలో రుతుక్రమం రాదు. లింగమార్పిడి చేసుకున్న వారు, నాన్-బైనరీ వ్యక్తులలో పీరియడ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. లింగమార్పిడి చేసుకున్న పురుషులు, నాన్-బైనరీ వ్యక్తులలో పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఋతుస్రావం అనేది కేవలం స్త్రీల సమస్య మాత్రమే కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం.

అపోహ సంఖ్య 5: టాంపోన్ లేదా మెన్స్ట్రువల్ కప్ ఉపయోగిస్తే, కన్యత్వాన్ని కోల్పోతారు

కన్యత్వం అనేది ఒక సామాజిక భావన. టాంపాన్‌లు లేదా మెన్‌స్ట్రువల్ కప్పుల వంటి పీరియడ్ కేర్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కన్యత్వంపై ప్రభావం ఉండదు. టాంపాన్‌లు, మెన్‌స్ట్రువల్ కప్‌ల వల్ల హైమెన్‌ను సాగదీయబడుతుంది, దీని వల్ల కన్యత్వాన్ని కోల్పోవడం జరగదు. సైకిల్ తొక్కడం, ఇతర శరీర శ్రమతో కూడిన చర్యల వల్ల సహజంగానే కన్య పోర విరిగిపోతుంది. టాంపోన్ లేదా మెన్స్ట్రువల్ కప్ ఉపయోగించడం సురక్షితంగానే చెప్పవచ్చు. అంతేకాకుండా చొప్పించే సమయంలో, హైమెన్ సాధారణంగా దానికి తగ్గట్టుగా సాగుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం