Happy Holi 2023 | రంగులతో ఆడుకుంటే మీ మానసిక ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో!
07 March 2023, 9:07 IST
- Happy Holi 2023: హోలీ రంగులతో ఆడుకోవడం వలన మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని సైకాలజిస్టులు అంటున్నారు. ఎలాగో తెలుసుకోండి.
Happy Holi 2023
Happy Holi 2023: దేశమంతటా హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి, ఒకరోజు ముందు నుంచే రంగులు చల్లుకుంటూ హోలీ జరుపుకోవడం ప్రారంభించారు. హోలీ ఎంతో ఉల్లాసభరితమైన, ఉత్సాహభరితమైన ఒక సాంప్రదాయ హిందూ పండుగ. స్నేహితులు, బంధువులు అందరూ బృందంగా చేరి రంగు నీళ్లు చల్లుకుంటూ, రంగులు పూసుకుంటూ ఆనందోత్సహాల మధ్య వేడుక జరుపుకునే సందర్భం ఇది. మీరూ హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకోండి, మీ ఆత్మీయులకు హోలీ శుభాకాంక్షలు చెబుతూ రంగులు పూయండి, రంగుల ఆటలు ఆడండి. ఎందుకంటే హోలీ ఒక పండగ మాత్రమే కాదు, మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచే ఒక చికిత్స కూడా అని నిపుణులు అంటున్నారు.
హోలీ సందర్భంగా రంగులతో ఆడుకోవడం, అందరినీ కలుస్తూ వారితో జతకట్టడం వంటివి సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇవి మీ జీవితంలో ఆరోగ్యకరమైన బంధాలను ఏర్పర్చడంతో పాటు, సానుకూల భావోద్వేగాలను కలిగిస్తాయి, మీకు సామాజికంగా కూడా పలు విధాలుగా మేలు జరుగుతుంది, మీ గౌరవం- ఆత్మగౌరవంతో ఇవి ముడిపడి ఉంటాయని సైకాలజిస్టులు అంటున్నారు.
Holi Colors Boost Mental Health- హోలీ రంగులతో మానసికోల్లాసం
వివిధ రంగులు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను కలిగి ఉంటాయి. రంగులతో ఆడుకునే వారికి మానసిక ఆరోగ్య ప్రయోజనాలు లభించే ఒక సందర్భం ఈ హోలీ పండగ అని చెబుతున్నారు.
ఒత్తిడి- ఆందోళన తగ్గుతుంది
ఉల్లాసమైన వాతావరణంతో పాటు గులాల్ అనేక రంగులు ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. మీ ప్రియమైన వారిని కలవడం, కొత్త స్నేహితులను సంపాదించడం, ఉల్లాసభరితమైన సంగీతానికి నృత్యం చేయడం వంటివి ఆందోళనను తగ్గించడంలో, మీ మానసిక స్థితిని పెంచడంలో సహాయపడతాయి.
సామాజిక పరస్పర చర్య
హోలీ అంటే మీ స్నేహితులు, బంధువులు కలిసి రంగులతో ఆడుకోవడానికి కలిసే రోజు. ఈ సందర్భం మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. మీరందరూ కలిసి మళ్లీ నాణ్యమైన సమయాన్ని గడపటానికి అవకాశం కల్పిస్తుంది. మీ సర్కిల్ పెరుగుతుంది, ఇది మీకు మాత్రమే కాకుండా మీ పిల్లలు కూడా మానసికంగా ఎదగడానికి సహాయపడుతుంది.
హ్యాపీ హార్మోన్లు
హోలీ ఒక సంతోషకరమైన సందర్భం. రంగులతో ఆడుకోవడం, అందరూ కలిసి తిరగటం, భోజనం చేయడం వల్ల మీ శరీరంలో మీకు మంచి అనుభూతిని కలిగించే సంతోషకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి.
కలర్ థెరపీ
హోలీ సందర్భంగా ఉపయోగించే శక్తివంతమైన రంగులు మన మనస్సు, మానసిక స్థితికి చికిత్స చేస్తాయి. విభిన్న రంగులు శక్తివంతమైన వైబ్‌లను అందిస్తాయి. ఇవి మీ ఉత్పాదకత పెంచేలా, మీలో సృజనాత్మకత మెరుగుపరిచేలా వివిధ భావోద్వేగాలను రేకెత్తిస్తాయి.