Happy Holi | వాట్సాప్‌లో హోలీ స్టిక్కర్స్ పంపించాలా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి!
17 March 2022, 21:50 IST
- కలర్స్ చల్లుకునే కలర్‌ఫుల్ పండుగ హోలీ రానే వచ్చింది. అందరూ ఈ హోలీని ఫ్యామిలీతో, స్నేహితులతో కలిసి హుషారుగా జరుపుకుంటున్నప్పటికీ ఇంకా చాలా మంది కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఏదైమేనా హోలీ శుభాకాంక్షలను తెలియజేసి మీ ఆనందాన్ని వారితో పంచుకోవచ్చు.
Happy Holi Wishes
ఇప్పుడు ప్రతీ పండగకు వాట్సాప్ లో శుభాకాంక్షలు తెలియజేసే స్టిక్కర్స్ పంపండం ఒక ట్రెండ్ గా మారింది. మరి ఈ హోలీకి మీరు కూడా హ్యాపీ హోలీ 2022, హ్యాపీ హోలీ WhatsApp స్టిక్కర్‌లను పంపాలనుకుంటున్నారా? అయితే ఎలా పంపాలో తెలియడం లేదా? మీ అందరికోసం వాట్సాప్ హోలీ ఫన్నీ స్టిక్కర్లు, GIFలను పంపే పద్ధతిని ఇక్కడ తెలియజేస్తున్నాం.
WhatsAppలో టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు పంపడం అందరికీ అయితే స్టిక్కర్ల కోసం ఎక్కడ వెతకాలో ఇక్కడ సూచిస్తాం. మీరు ఏ భాషలోనైనా ఈ స్టిక్కర్లు పంపవచ్చు.
1. హ్యాపీ హోలీ WhatsApp స్టిక్కర్లను పంపడానికి, ముందుగా మీరు ఎవరికైతే స్టిక్కర్‌ను పంపాలనుకుంటున్నారో వారి వాట్సాప్ చాట్‌ను తెరవండి.
2. చాట్ బాక్స్‌లో మెసేజ్ చేసే చోట ఎడమ వైపున ఉన్న స్మైలీ ఐకాన్‌పై నొక్కండి. ఇప్పుడు స్మైలీస్ కిందకు వెళ్తే అక్కడ GIF అనే చిహ్నం పక్కన ఉన్న స్టిక్కర్ చిహ్నాన్ని నొక్కండి. ఆ స్టిక్కర్‌ల ప్యానెల్ లోపల కుడివైపు పైభాగాన “+” గుర్తును చూస్తారు, దానిపై క్లిక్ చేయండి.
3. ఇలా క్లి చేసిన తర్వాత All Stickers అని కనిపిస్తుంది. కిందభాగంలో Discover Sticker Apps అని ఉంటుంది. దానిని క్లిక్ చేయండి.
4. మీకు Google Play Store ఓపెన్ అవుతుంది. అక్కడ సెర్చ్ బార్ మీద హోలీ స్టిక్కర్ల ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
5. హోలీ స్టిక్కర్ల ప్యాక్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత My Stickers ట్యాబ్‌లో చూస్తే.. అక్కడ మీకు కావాల్సిన స్టిక్కర్స్ వచ్చేస్తాయి. వాటిని మీ ఇష్టమైన వారితో పంచుకోండి.
'హిందుస్తాన్ టైమ్స్ -తెలుగు' తరఫున అందరికీ హోలీ శుభాకాంక్షలు.