Hair Root Strengthening : జుట్టు మూలాలకు బలం అవసరం.. ఇలా చేస్తే సరిపోతుంది
30 May 2024, 12:30 IST
- Hair Root Strengthening Tips : జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మూలాలు బలంగా ఉండాలి. అందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మీ జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి.
జుట్టు బలోపేతం చేసేందుకు చిట్కాలు
జుట్టు సమస్యలను ప్రారంభంలోనే గుర్తించి వాటికి పరిష్కారం కనుగొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మన జుట్టు పాడైపోతుంది. అన్ని రకాల జుట్టు సమస్యలను పరిష్కరించాలంటే, ముందుగా జుట్టు మూలాలను బలోపేతం చేయడం గురించి ఆలోచించాలి. ఇది అనేక జుట్టు సమస్యలను పరిష్కరించడంతో పాటు, జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఈ విషయాలపై చాలా శ్రద్ధ వహించాలి.
జుట్టు మూలాలను ఎలా బలోపేతం చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. అందుకోసం మీరు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి, జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మార్గాలను పాటించవచ్చు. బలహీనమైన జుట్టు తరచుగా జుట్టు మూలాలను దెబ్బతీస్తుంది. అంతే కాదు చివర్లు చీలిపోవడానికి కూడా దారి తీస్తుంది. ఈ విషయాలన్నీ చాలా సీరియస్‌గా తీసుకోవాలి. కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. జుట్టు బలంగా తయారవుతుంది.
మంచి ఆహారం
మెుత్తం ఆరోగ్యం జుట్టు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవడాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే, ఐరన్, జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని ఆచరించాలి.
మసాజ్
మసాజ్ జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రతిరోజూ కనీసం నాలుగు నిమిషాల పాటు మీ జుట్టుకు మసాజ్ చేయండి. ఇది మీ జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ మసాజ్ జుట్టు పెరుగుదలకు అవసరమైన ఆక్సిజన్ తదితరాలను అందించడంలో కూడా సహాయపడుతుంది.
కలబంద
కలబంద ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడటమే కాకుండా దానికి అనుకూలమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. కలబంద జుట్టు సహజత్వాన్ని కాపాడుకోవడంతో పాటు జుట్టుకు ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు మూలాల్లోకి లోతుగా చొచ్చుకుపోయి ప్రయోజనాలను పెంచుతాయి.
ఎగ్ మాస్క్
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, మెరుపును జోడించడం, మూలాలను బలోపేతం చేయడంలో గుడ్డు చాలా సహాయపడుతుంది. ఇందులోని ప్రొటీన్ జుట్టులోనికి చొచ్చుకుపోయి ఆరోగ్యవంతమైన జుట్టును ఇస్తుంది. వారానికి కనీసం రెండు మూడు సార్లు ఎగ్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టులో మంచి మార్పు వస్తుంది. గుడ్లు వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
మందార
మందార మీ జుట్టును మెరిసేలా చేయడం, జుట్టు పెరుగుదల, జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. మందార ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది మీ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు.
కొబ్బరి పాలు
కొబ్బరి పాలు జుట్టు ఆరోగ్యానికి, మూలాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. జుట్టుకు ఇచ్చే మార్పులు చిన్నవి కావు. కొబ్బరి పాలు అవసరమైన కొవ్వులు, ప్రోటీన్లు, పోషకాల గొప్ప పవర్ హౌస్. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా ఇది మీ స్కాల్ప్, హెయిర్ ఫోలికల్స్‌కు పోషణనిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.