తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curry Leaves Benefits | కరివేపాకును అలా తీసేయకండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి!

Curry Leaves Benefits | కరివేపాకును అలా తీసేయకండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి!

HT Telugu Desk HT Telugu

04 April 2023, 10:10 IST

    • Curry Leaves Benefits: కూరలో వచ్చిన కరివేపాకును తీసేస్తున్నారా? కానీ మీరు ఎన్ని పోషకాలను మిస్ అవుతున్నారో తెలిస్తే ఇకపై అలా చేయరు. కరివేపాకు ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
Curry Leaves Benefits
Curry Leaves Benefits (Unsplash)

Curry Leaves Benefits

కరివేపాకును తియ్యటి వేపా (Seet Neem Leaf)కు అంటారు, దీనిని కొన్ని చోట్ల కళ్యామాకు అని కూడా పిలుస్తారు. కరివేపాకు శాస్త్రీయనామం ముర్రయా కోయినిగి (Murraya koenigii). సాధారణంగా మనం కరివేపాకు (Curry Leaves) ను వివిధ కూరల్లో వినియోగిస్తాం. సాంబార్, రసం, చట్నీ వాటిల్లో తప్పకుండా కరివేపాకును వేస్తాం. కరివేపాకుకు ఉండే ప్రత్యేకమైన సువాసన, రుచి వలన దీనిని వంటకాల్లో వేసినపుడు ఆ వంటకు అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది.

అయితే చాలా మంది తినేటపుడు కూరలో వచ్చిన కరివేపాకును తీసి పక్కన పెడతారు, తినకుండా వదిలేస్తారు. మీరూ ఈ జాబితాలో ఉంటే, మీ ఆరోగ్యానికి దక్కాల్సిన మంచి ప్రయోజనాలను కోల్పోతున్నట్లే. ఎందుకంటే కరివేపాకు మంచి రుచి, సువాసనలకే కాదు, గొప్ప ఔషధగుణాలకు ప్రసిద్ధి.

100 గ్రాముల కరివేపాకు (Curry Leaves Nutrition) దాదాపు 108 కేలరీల శక్తిని అందిస్తుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ మొదలైన విటమిన్లు కూడా ఉన్నాయి. కరివేపాకును ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.


Curry Leaves Benefits- కరివేపాకు ప్రయోజనాలు

కరివేపాకును తినడం, వివిధ మార్గాల్లో కరివేపాకును ఉపయోగించడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూడండి.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది

కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉంటాయి, ఇవి మీ శరీరం బరువు పెరగకుండా (Weight loss control) ఆపగలవు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి, మీరు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే, సలాడ్ లేదా ఇతర వంటలలో వచ్చిన కరివేపాకును వదలకుండా తినండి. మీరు ఎండిన కరివేపాకులను కూడా చిరుతిండిలో కలుపుకొని తినవచ్చు.

విరేచనాలు, మలబద్ధకం నయం చేస్తుంది

కరివేపాకు విరేచనాలు, మలబద్ధకం (Constipation) సహా ఇతర జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ప్రేగు కదలికను ప్రోత్సహించడంలో, జీర్ణ ఎంజైమ్‌లను పెంచడంలో కరివేపాకు సహాయపడుతుంది. ఎండిన కరివేపాకును మెత్తగా పొడిచేసుకొని మజ్జిగలో కలిపి, రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చాలా మంచిది. లేదా పచ్చిగా కూడా లేత కరివేపాకులను ఖాళీ కడుపుతో నమలవచ్చు.

మార్నింగ్ సిక్ నెస్ నుంచి ఉపశమనం

చాలా మందికి ఉదయం లేచిన తర్వాత తలతిప్పినట్లుగా, వికారంగా (Morning Sickness) అనిపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మొదటి త్రైమాసికంలో ఉదయాన్నే అనారోగ్యం, వికారం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కరివేపాకును తినడం ద్వారా మంచి అనుభూతిని పొందవచ్చు. కరివేపాకు శరీరంలో జీర్ణ రసాలను పెంచుతుంది, ఇది వికారం, మార్నింగ్ సిక్నెస్, వాంతులు వంటి భావాలను తగ్గిస్తుంది.

బ్యాక్టీరియాను తొలగిస్తుంది

కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్, యాంటీ బాక్టీరియల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగిన సమ్మేళనాలు ఉంటాయి. కరివేపాకులో లినోలోల్ అనే సమ్మేళనం కూడా ఉంది, ఇది వాటికి ప్రత్యేకమైన సువాసనను ఇస్తుంది. బ్యాక్టీరియాను చంపగలదు. లినోలోల్ శరీరం నుండి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

మధుమేహం నిర్వహణలో సహాయపడుతుంది

కరివేపాకు తినడం వలన మధుమేహం లక్షణాలను నియంత్రించవచ్చు. కరివేపాకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైన ఏజెంట్. కరివేపాకులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, తద్వారా మన రక్తంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగడాన్ని నివారిస్తుంది. ఇవి ఇన్సులిన్ చర్యను కూడా పెంచుతాయి, మధుమేహం ఉన్నవారు మీ డయాబెటిక్ డైట్ ప్లాన్‌లో కరివేపాకుతో చేసే వివిధ సలాడ్లు, వంటకాలు చేర్చడానికి ప్రయత్నించండి.

జుట్టుకు అద్భుతమైనది

కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి వేడిచేయడం వలన ఒక అద్భుతమైన హెయిర్ టానిక్‌ తయారవుతుంది, ఇది వాడటం వలన తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది, నల్లని జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. అవి జుట్టు కుదుళ్ల నుంచి బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. చుండ్రు నివారించడంలో కూడా సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం