తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Guava Leaves: జామ ఆకులను ఇలా వాడారంటే డయాబెటిస్ దూరం, బరువు కూడా తగ్గుతారు

Guava leaves: జామ ఆకులను ఇలా వాడారంటే డయాబెటిస్ దూరం, బరువు కూడా తగ్గుతారు

Haritha Chappa HT Telugu

01 July 2024, 9:30 IST

google News
  • Guava leaves: ఏడాది పొడవునా జామ ఆకులు అందుబాటులోనే ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఇన్నీ అన్నీ కావు. ఇవి డయాబెటిస్‌ను తగ్గించడం నుంచి బరువు తగ్గడం వరకు అన్నింటినీ అడ్డుకుంటుంది. 

జామ ఆకుల ఉపయోగాలు
జామ ఆకుల ఉపయోగాలు (shutterstock)

జామ ఆకుల ఉపయోగాలు

Guava leaves benefits: జామకాయను భాగం చేసుకోవడం చాలా అవసరం. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధిత్ బాధపడుతున్నవారు కచ్చితంగా జామకాయను తినాలి. ఇది పేదవాడి పండుగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే దీని ధర తక్కువగానే ఉంటుంది. కేవలం జామ కాయలే కాదు జామ ఆకులు కూడా తినాల్సిన అవసరం ఉంది. జామ ఆకులు ఏడాదంతా అందుబాటులోనే ఉంటాయి. ఈ ఆకులను తినడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవంచ్చు.

జామపండు మాదిరిగానే దాని ఆకులను నమలడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి. ముఖ్యంగా ఖాళీ పొట్టతో జామ ఆకులు తినడం వల్ల జరిగే మేలు ఎక్కువ. జామ ఆకుల్లో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, డైటరీ మినరల్స్, పొటాషియం, కాపర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం ద్వారా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. జామ ఆకులను నమలడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు…

జామ ఆకులను రోజూ తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఫినోలిక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ రోగికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది కాకుండా జామ ఆకు రసంలో ఉండే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను కూడా నియంత్రిస్తాయి.

మెరుగైన జీర్ణక్రియ

ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. జామ ఆకుల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ ఆకులను నమలడం వల్ల అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

బరువు తగ్గడం

ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల బెల్లీ ఫ్యాట్ తో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే సమ్మేళనాలు శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణను నిరోధిస్తాయి. ఇది బరువు పెరగడానికి దారితీయదు. జామకాయలో లభించే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, వ్యాధులను కలిగించే వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. జామ ఆకులను తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

బీపీ అదుపులో

జామ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. జామపండు మాదిరిగానే, దీని ఆకుల్లో కూడా పొటాషియం, ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇలా తినండి

జామ ఆకులను సాధారణంగా కాకుండా… ఖాళీ పొట్టతో నమిలితే ఎక్కువ ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. ఆ ఆకులను రెండు నిమిషాలపాటూ నీటిలో నానబెట్టాలి. ఆ ఆకులపై ఉన్న మురికి పోతుంది. అలా శుభ్రంగా కడిగిన తరువాత రెండు ఆకులను నమలడం మంచిది. ఆ సారాన్ని మింగేస్తే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం