Good Morning Messages । ఈరోజు ఏదో ఒకటి అదరగొట్టండి.. మీలో స్ఫూర్తిని నింపే సందేశాలు ఇవిగో, శుభోదయం!
03 October 2022, 7:04 IST
- Good Morning Messages in Telugu: మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించండి. మీలో సానుకూల శక్తిని నింపే కొటేషన్లు, శుభోదయం సందేశాలు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. వీటిని చదవండి, వాట్సాప్ లో షేర్ చేసుకోండి.
Good Morning Greetings in Telugu
Good Morning Messages in Telugu: మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించడం వలన మనలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది ఇది మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జీవితం పట్ల మన దృక్పథం కూడా సానుకూలంగా ఉండేలా చేస్తుంది. నిన్నటి రోజు ఎలా గడిచినా, అది గడిచిపోయింది. నిన్నటి గురించి ఆలోచించటం అనవసరం, ఈరోజు ఏంటి అనేదే ముఖ్యం. ప్రతి రోజును ఒక కొత్త అవకాశంగా తీసుకొని, ఈరోజు ఇంకాస్త మెరుగైన పనితీరు చూపాలి, జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.
ఉదయం లేవగానే మీలో సానుకూల శక్తిని ప్రసరింపజేసే చర్యలు తీసుకోండి. మీ ఆరోగ్యం కోసం ఒక పది నిమిషాలు మార్నింగ్ వాక్‌కు వెళ్లండి, యోగా లేదా వాయామాలు చేయండి. చురుకుగా, హుషారుగా ఉండండి. ఉదయం మీ వైఖరి ఎలా ఉంటుందో రోజంతా మీకు అలాగే ఉంటుంది. మీలో ప్రేరణ కలుగజేసే చర్యలు సూక్తులు, కొటేషన్లు చదవండి. మీరే కాకుండా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో మంచి ఆలోచనలు పంచుకోండి. ఇది మిమ్మల్ని, మీ చుట్టూ ఉండే వారిని సానుకూలంగా ఉంచుతుంది.
ఇక్కడ కొన్ని అందమైన, స్పూర్తిదాయకమైన శుభోదయం సందేశాలను అందిస్తున్నాం. వీటిని చదివి మీరూ స్ఫూర్తి పొందవచ్చు, వాట్సాప్ స్టేటస్‌లాగా పెట్టుకొని స్ఫూర్తి పంచవచ్చు.
Good Morning Messages in Telugu
సమస్య తీర్చమని దేవుడిని వేడుకోవడం కన్నా..
ఆ సమస్యను ఎదుర్కునే శక్తిని
ప్రసాదించమని కోరుకోవడం మంచిది..
శుభోదయం..
వంద వ్యర్థమైన మాటలు వినడం కన్నా..
ప్రశాంతతను అందించే ఒక్క
మంచిమాట వినడం ఉత్తమం.
గుడ్ మార్నింగ్!
ఒక చిన్ని నవ్వుతో కోపాలు కరిగిపోతాయి,
ప్రేమలు వికసిస్తాయి.
నవ్వుతో రోజును ప్రారంభించండి,
ఎల్లప్పుడు నవ్వుతూ ఉండండి.
గుడ్ మార్నింగ్
జీవితంలో మనం అన్నీ
కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం
ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.. అదే భవిష్యత్తు!
శుభోదయం!!
సరైనది చేయడానికి సమయం ఎల్లప్పుడూ సరైనదే!
శుభోదయం!!
పొగిడేవాళ్లు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు..
తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు..
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.
గుడ్ మార్నింగ్..!