Morning Yoga | ఉదయం లేవగానే ఈ 3 యోగాసనాలు వేస్తే రోజంతా ఉత్సాహం!
ఉదయం లేవగానే యోగాసనాలు వేస్తే శరీరంలో సోమరితనం పోయి ఉత్సాహం, శక్తి లభిస్తుంది. కాబట్టి రోజూ ఉదయం యోగా చేయాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ఒక్కోసారి సమయం ఆలస్యంగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ రాత్రి పడుకొని ఉదయం నిద్ర నుంచి లేచేటపుడు అప్పుడే తెల్లారిపోయిందా అనిపిస్తుంది. ఇంకొద్దిసేపు పడుకోవాలి అని బద్ధకం ఆవహిస్తుంది. ఏదో రకంగా లేచి పనులు చేసుకుందామనుకున్నా, సోమరితనంగా అలసటగా అనిపిస్తుంది.అయితే మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే.. మీలో ఆ బద్ధకం పోగోట్టి ఉత్సాహాన్ని నింపేందుకు కొన్ని సులభమైన యోగాసనాలు ఉన్నాయి.
ఉదయం లేచిన తర్వాత ఇలాంటి యోగాసనాలు వేస్తే మీ అలసటను పోగొట్టి మీకు అవసరమైన శక్తిని ఇస్తుంది. తద్వారా రోజంతా హుషారుగా ఉంటారు. అవేంటో ఇక్కడ చూడండి.
1. బాలాసనం
ఈ యోగాసనం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శారీరకంగా మీ ఛాతీ, వీపు, భుజాలపైన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. పగటి సమయంలో కూడా మీకు మైకముగా లేదా అలసటగా అనిపిస్తే. కొన్ని నిమిషాలు బాలాసనం భంగిమలో ఉంటే మార్పు కనిపిస్తుంది. ఈ ఆసనం వెన్ను, తుంటి, తొడలు, చీలమండల వరకు కండరాల్లో సున్నితమైన సాగతీతను కలిగించి మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.
2. వీరభద్రాసనం
వీరభద్రాసనం అనే యోగా భంగిమ శరీరానికి స్థిరత్వాన్ని కల్పిస్తుంది. ఇది మీ భుజాలను బలోపేతం చేయడానికి, భుజాలలో సమతుల్యత మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం ద్వారా శరీర భాగాలను సాగదీయడం చేయడం ద్వారా ఆయా భాగాలకు రక్తప్రసరణను కలిగించి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇలా మొత్తం శరీర భాగాలకు శక్తి లభిస్తుంది కాబట్టి, ఇది మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.
3. ధనురాసనం
ఈ ఆసనం కాళ్లు, చేతి కండరాలపై ప్రభావం చూపుతుంది. దీంతో మీకు నడవటానికి, పనులు చేసుకోవడానికి కొత్త శక్తి, ఉత్సాహం లభిస్తాయి. స్త్రీలు రుతుక్రమంలో ఉన్నపుడు ఉన్నపుడు ధనురాసనం వేస్తే వారికి నొప్పుల నుంచి ఉపశమనం కలిగి శక్తి లభిస్తుంది. మలబద్ధకం సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది.
సంబంధిత కథనం