తెలుగు న్యూస్  /  Lifestyle  /  Food Poisoning Know Causes Symptoms And Home Remedies Treatment

Food Poisoning। ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్లు ఎలా గుర్తించవచ్చు? నివారణ మార్గాలు!

HT Telugu Desk HT Telugu

29 November 2022, 21:54 IST

    • Food Poisoning Home Remedies: ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి కారణాలేమి? ఈ సమస్య వచ్చినపుడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఫుడ్ పాయిజనింగ్ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రాథమిక ఇంటి చికిత్స విధానాలు ఇక్కడ తెలుసుకోండి.
Food Poisoning Home Remedies
Food Poisoning Home Remedies (Unsplash)

Food Poisoning Home Remedies

ఫుడ్ పాయిజనింగ్ అనేది కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్య. చాలా సందర్భాల్లో ఫుడ్ పాయిజనింగ్ అనేది అంత తీవ్రమైనదేం కాదు, ఇది ఒక తేలికపాటి సమస్య. సాధారణంగా చికిత్స లేకుండానే పరిష్కారం అవుతుంది. వ్యక్తులను బట్టి ఇది 24 గంటలు నుంచి ఒక వారం వరకు పట్టవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ జరిగినపుడు అత్యంత సాధారణ లక్షణాలు వికారం, వాంతులు, విరేచనాలు ఉంటాయి.

ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం తరచుగా గుర్తించలేము. పౌల్ట్రీ లేదా మాంసాన్ని సరిగ్గా వండకపోవడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు, దీని ద్వారా సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్‌కు కలుషిత నీరు కూడా ఒక కారణం కావచ్చు.

Food Poisoning Home Remedies- ఫుడ్ పాయిజనింగ్‌కు ఇంటి నివారణలు

ఫుడ్ పాయిజనింగ్‌ జరిగినపుడు కడుపులో తిప్పినట్లుగా అవడం, వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. అయితే కొన్ని ఇంటి నివారణలతోనే ఫుడ్ పాయిజనింగ్‌కు చికిత్స చేయవచ్చు. అవేమిటో ఈ కింద చూడండి.

ఓఆర్ఎస్

వాంతులు, అతిసారం ఉన్నప్పుడు శరీరాన్ని రీహైడ్రేట్ చాలా ముఖ్యం. ఇందుకోసం నీటితో పాటు కొన్ని లవణాలను కలిపి తాగాలి. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం స్వచ్ఛమైన తాగునీటిలో కొంచెం చక్కెర, ఉప్పు కలిపడం ద్వారా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్) ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన ఈ ఎలక్ట్రోలైట్-రిచ్ సొల్యూషన్‌ను ప్రతి కొన్ని నిమిషాలకు సిప్ చేయాలి, ఈ ద్రావణాన్ని ఒక రోజులోపే వాడాలి. లేదా కొబ్బరి నీళ్లలో చిటికెడు దాల్చిన చెక్కను కలిపి సేవించడం వల్ల కూడా వాంతులు తగ్గుతాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ పళ్ల రసం నుంచి తయారు చేసే ఆపిల్ సైడర్ వెనిగర్ ద్రావణం ఆల్కలీన్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్‌ను సమర్థవంతంగా నయం చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లోని ఆల్కలీన్ ప్రభావం మన కడుపులోని ఆమ్లతను తగ్గిస్తుంది, ఫుడ్ పాయిజనింగ్ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

అల్లం

ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలను తగ్గించడంలో అల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిలోని సహజ శోథ నిరోధక గుణాల కారణంగా, ఇది కడుపు లైనింగ్‌కు ఉపశమనం కలిగిస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక చెంచా తురిమిన అల్లం వేసి మరిగించాలి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు కొంచె తేనె కలుపుకొని తాగాలి.

తేనె

తేనే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఫుడ్ పాయిజనింగ్ నివారణలలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ తేనెను రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. లేదా నిమ్మరసంతో కూడా తీసుకోవచ్చు.

నిమ్మకాయ

ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించినంత వరకు నిమ్మకాయను 'చికిత్సల రాజు' గా పరిగణిస్తారు. నిమ్మకాయలోని బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని తేనెతో కలిపి నేరుగా తినాలి. .

వెల్లుల్లి

వెల్లుల్లి దాని యాంటిపైరేటిక్‌ గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది జ్వరం, గుండె జబ్బుల లక్షణాలను తగ్గించగలదు. దీనిలోని బలమైన యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల కారణంగా, ఇది అతిసారం, కడుపు నొప్పి వంటి లక్షణాలను తగ్గిస్తుంది. రోజూ ఒక గ్లాసు నీటితో ఒక వెల్లుల్లి రెబ్బను కలిపి తాగండి. లేదా వెల్లుల్లి, సోయాబీన్ నూనె మిశ్రమాన్ని సిద్ధం చేసి, రాత్రి భోజనం తర్వాత మీ కడుపుపై ​​మసాజ్ చేయండి.

గమనిక: ఇవి కేవలం ఇంటి నివారణలు మాత్రమే. తేలికపాటి వాంతులు, విరోచనాల లక్షణాలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధారణంగా సూచిస్తారు. మైరుగైన చికిత్స కోసం వైద్య సహాయం తీసుకోవడమే అన్ని విధాల ఉత్తమం.

టాపిక్