తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Tips : పిల్లలు తెలివిగా పుట్టాలంటే గర్భిణులు ఈ టిప్స్ ఫాలో కావాలి

Pregnancy Tips : పిల్లలు తెలివిగా పుట్టాలంటే గర్భిణులు ఈ టిప్స్ ఫాలో కావాలి

Anand Sai HT Telugu

08 January 2024, 14:15 IST

google News
    • Pregnancy Tips : పిల్లలు తెలివైనవారిగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. గర్భంలో ఉన్నప్పుడే తెలివైన వారిగా మారాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం..
గర్భిణులకు చిట్కాలు
గర్భిణులకు చిట్కాలు (Freepik)

గర్భిణులకు చిట్కాలు

బిడ్డ కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారు. వారికి కొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి. అయితే బిడ్డ తెలివిగా పుట్టాలంటే.. గర్భంలో ఉన్నప్పుడే కొన్ని చిట్కాలు పాటించాలి. నిజానికి కడుపులో ఉన్న సమయంలోనే బిడ్డ బయటి ప్రపంచాన్ని, ఇక్కడ జరిగే విషయాలను గ్రహించే శక్తి ఉటుంది. కొందరు స్త్రీలు గర్భధారణ సమయంలో పౌరాణిక కథలు చదవడం, మంత్రాలు పఠించడం, సంగీతాన్ని వినడం చేస్తుంటారు. ఇలా మహిళలు కొన్ని చిట్కాలు పాటిస్తే బిడ్డ తెలివిగా పుడుతుంది.

మీ కడుపులో బిడ్డ ఉంటే బయట జరిగే ప్రతి ఆలోచన వారికి తెలుస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. మూడో త్రైమాసికంలో ఏ గర్భిణి అయినా తన ఎదురుగా బిడ్డ ఉందని భావించి నిరంతరం కథలు చెప్పడం ప్రారంభిస్తే, కడుపులో ఉన్న శిశువుకు తెలివితేటలను పెరుగుతాయని చెబుతారు.

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు రెండు ప్రాణాలకు ఆహారం ఇవ్వాలి. ఆరోగ్యకరమైన ఆహారం మీ మొదటి ప్రాధాన్యత అని గుర్తుంచుకోవాలి. తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండటం మంచిది. బిడ్డ ఎదుగుదలకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చాలా అవసరం. మీ ఆహారంలో చేపలు, సోయాబీన్స్, పాలకూరను చేర్చుకోండి. బిడ్డ తెలివిగా ఉంటుంది.

ఐరన్ పుష్కలంగా ఉండే ఆకు కూరలు పిల్లల మానసిక వికాసంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బాదం, వాల్‌నట్‌లు పిల్లలతో పాటు పెద్దవారిలో మెదడు కణాల అభివృద్ధికి సహాయపడతాయి. కొంతమంది గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో క్యారెట్ లేదా దాని రసం తాగుతారు. ఇది పిల్లల ఎదుగుదల, మేధస్సు కోసం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది

గర్భిణీ శరీరానికి థైరాయిడ్ చాలా ముఖ్యమైనది. గర్భధారణ సమయంలో అది మారుతుంది. గర్భిణీ శరీరంలో ఇలా జరిగితే, అది పిల్లల మేధస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సమతుల్య ఆహారం, ఆరోగ్య స్థితిని నిర్వహించడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో సోడియం మొత్తాన్ని స్థిరంగా ఉంచండి. ఇలాంటప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ , పెరుగు తినాలని గైనకాలజిస్టులు చెబుతున్నారు.

డెలివరీకి ముందు, తర్వాత శరీరానికి ఎక్కువ పోషకాలు అవసరం. మీరు తినే ఆహారంతో పాటు మంచి పోషక పదార్థాలను తీసుకోవడం ముఖ్యం. దీని వల్ల పిల్లల ఎదుగుదల బాగా జరిగి ప్రసవం సాఫీగా జరుగుతుంది. ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్ సప్లిమెంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు వాటిని తీసుకుంటే పుట్టబోయే బిడ్డ తెలివితేటలు పెరుగుతాయి.

గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. శరీరంలో హార్మోన్లు మారుతాయి. ఈ సమయంలో మానసికంగా చాలా అలసట ఉంటుంది. గర్భంతో ఉన్నప్పుడు సరదాగా ఉండాలి. వీలైతే వ్యాయామం, నడక కూడా చేయాలి. ఇది కడుపులో పెరుగుతున్న శిశువుపై కూడా ప్రభావం చూపుతుంది. సంతోషంగా ఉన్న తల్లికి పుట్టిన బిడ్డ ఎల్లప్పుడూ తెలివైన, ఆరోగ్యకరమైన బరువుతో ఉంటుంది.

బిడ్డ కడుపులో పెరుగుతున్నప్పుడు గర్భిణీ ఉల్లాసమైన సంగీతాన్ని వింటే, అది శిశువు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. మాట్లాడటం, నవ్వడం, కబుర్లు చెప్పడం వరకు ఏదైనా మంచి విషయాలు చేయాలి. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఎందుకంటే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే ఇదంతా గమనిస్తుంది. దీనికి ప్రధాన కారణం గర్భిణీ శరీరంలో హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ విడుదల కావడం.

గర్భిణీ స్త్రీలు తమ బొడ్డును సున్నితంగా మసాజ్ చేయాలి. తద్వారా బిడ్డను ఉత్తేజపరచవచ్చు. బిడ్డ కడుపులో చురుగ్గా ఉంటుంది. ఇది శిశువు నాడీ వ్యవస్థను ఉత్తమంగా అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు బాదం నూనెతో మసాజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా పువ్వులు, పండ్లు, రసాయన రహిత వాసన చూస్తుంటే కడుపులోని దానిని గ్రహించగలదు. ఇది మెదడు అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.

మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు ఉదయాన్నే నడవాలి. వారి శరీరానికి ఎక్కువ విటమిన్ డి కంటెంట్‌ను అందిస్తుంది. గర్భిణీ ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు నడవాలి. ఇది పిల్లల ఎముకల పెరుగుదల, శారీరక బలాన్ని పెంచుతుంది. కోడి గుడ్లు, చేపలను తినండి. ఇది కడుపులో ఉన్న శిశువు గుండె అభివృద్ధికి సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం