Chanakya Niti : ఇలాంటి మహిళల కోసం వెతకండి.. మీతో ఉంటే అదృష్టం
Chanakya Niti About Women : చాణక్య నీతిలో స్త్రీల గురించి చాణక్యుడు గొప్పగా చెప్పాడు. కొన్ని గుణాల ఉన్న స్త్రీలతో పురుషులకు అదృష్టం వస్తుందని పేర్కొన్నాడు.
చాణక్యుడి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చెప్పాడు. చాణక్య నీతి వ్యక్తిగత జీవితం, పని, వృత్తి, సంబంధాలు, స్నేహం, శత్రువులు వంటి జీవితంలోని వివిధ అంశాలపై అభిప్రాయాలను వివరించాడు. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు కాస్త కఠినంగా అనిపించినప్పటికీ, ఈ విషయాలు ఒక వ్యక్తికి మంచి చేసేవి. తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని తెలుపుతాయి. చాణక్య నీతి మనిషి జీవితంలో విజయం సాధించేలా చేస్తుంది.
చాణక్య నీతి ప్రకారం.. కొంతమంది స్త్రీలను వివాహం చేసుకున్న వ్యక్తి జీవితంలో అదృష్టాన్ని తెచ్చుకుంటాడు. అలాంటి మహిళల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.. పురుషులకు, కుటుంబానికి అదృష్టాన్ని తీసుకువచ్చే స్త్రీలు ఎవరో మీరు తెలుసుకోవాలి.
చాణక్యుడు ప్రకారం స్త్రీలు చాలా సున్నితంగా భావిస్తారు. సున్నితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. సంతోషమైనా లేదా విచారమైనా ప్రతిదానికీ మొదట ఏడుస్తారు. అలాంటి స్త్రీలు ఇతరుల కంటే ఏ విధంగానూ తక్కువ కాదు. ఏడ్చే స్త్రీల పాత్ర కాస్త విచిత్రంగా ఉంటుంది. అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకున్న వారి జీవితాల్లో అదృష్టవంతులు అవుతారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీలు ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటారో ఇప్పుడు చూద్దాం.
చాణక్యుడు ప్రకారం పురుషుల కంటే స్త్రీలకు మానసికంగా ఎక్కువగా బలం ఉంటుంది. ఒక మహిళ చిన్న చిన్న వాటికే ఏడిస్తే.. ఆమె మనసు బంగారం. పురుషులందరూ అలాంటి స్త్రీని గౌరవించాలి. అలాంటి స్త్రీలు నిజమైన, నాణ్యమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఏడ్చే లేదా తమ ప్రేమికుడు లేదా భర్త నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడని స్త్రీలు గొప్పవారు. అలాంటి స్త్రీలను కుటుంబానికి చాలా మంచిగా భావిస్తారు. మంచి మనసు గల స్త్రీలు అందరి భావాలను గౌరవిస్తారని, అయితే మన జీవితంలో అలాంటి స్త్రీలను కోల్పోకూడదని చాణక్యుడు చెప్పాడు.
చాణక్యుడు ప్రకారం, ఏ తప్పు చేయకుండా ఏడ్వడం ప్రారంభించే స్త్రీకి మాతృ భావన ఉంటుంది. ఈ గుణం కారణంగా స్త్రీ కుటుంబ సభ్యులందరితో బాగా కలిసిపోతుంది. స్త్రీల ఏడ్పులు, కేకలు వేయడం వల్ల అనేక రకాల తీవ్రమైన వ్యాధులు నయమవుతాయని, ఏడుపు వల్ల మనసు, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఏడ్చే అమ్మాయిలు ఎవరి మనోభావాలను గాయపరచరు. ఈ మహిళలు ఎల్లప్పుడూ ఇతరుల భావాలను గౌరవిస్తారు. తరచుగా ఏడ్చే మహిళలు ఆకలితో వచ్చిన వారికి ఆహారం ఇవ్వకుండా నిద్రపోరు. వారికి అలాంటి గుణం ఉంటంది. వారు ఎవరినీ ఆకలితో ఉండనివ్వరు. చాణక్య నీతిలో పైన పేర్కొన్న లక్షణాలతో ఉన్న స్త్రీలను ఎప్పటికీ కోల్పోకూడదని చెప్పాడు. స్త్రీలను గౌరవిస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కించపరచకూడదు.