Sleep All Day : రోజంతా నిద్రపోవడం, అలసట పెద్ద పెద్ద వ్యాధులకు సంకేతమా?
08 June 2024, 18:30 IST
- Sleep All Day : కొందరు రోజంతా నిద్రపోయేందుకు ఆసక్తి చూపిస్తారు. అలసట ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉండటం ఆరోగ్యానికి మంచిదేనా?
రోజులో నిద్రపోతే వచ్చే సమస్యలు
మీకు ఎప్పుడూ నిద్ర, అలసటగా అనిపిస్తుందా? ప్రస్తుతం చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఐదుగురు పెద్దలలో ఒకరు వారానికి కనీసం మూడు రోజులు ఈ నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే దాని వెనుక కారణం ఏంటో తెలుసా? మీకు అనేక శారీరక, మానసిక సమస్యలు ఉండవచ్చు. దానిని లైట్ తీసుకోవద్దు. పని సమయంలో నిద్రపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి..
రాత్రిపూట నిద్రపోకపోతేనే సమస్యలు వస్తాయి. ఎందుకంటే రాత్రిపూట సరిపడా నిద్రపోకపోతే మరుసటి రోజంతా నిద్రగా అనిపిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు టీ, కాఫీలకు దూరంగా ఉండండి. కనీసం 1 గంట ముందు మొబైల్ లేదా టీవీ చూడటం మానుకోండి.
శరీరానికి శక్తి వనరు ఆహారం. మీరు మీ ఆహారంలో సమతుల్య ఆహారాన్ని కలిగి ఉండాలి. రోజువారీ దినచర్య ప్రకారం తినడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారానికి బదులుగా నూనె, ఉప్పు, మసాలాలతో కూడిన ఫాస్ట్ ఫుడ్‌ను ఇష్టపడతారు చాలా మంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాటును మార్చుకోవాలి. తగినంత ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు తినండి. శరీరంలో సరైన పోషకాహారం లేకపోతే శక్తి లోపం ఏర్పడుతుంది. ఫలితంగా, అలసట, నిద్ర వస్తుంది.
శారీరక శ్రమ చేయకూడదనుకునే చాలా మంది అనుకుంటారు. గంటల తరబడి మంచంలో పడుకోవడం, కుర్చీలో కూర్చోవడం చేస్తుంటారు. ఇది శరీరంలో శక్తి లోపానికి కారణమవుతుంది. అంతే కాదు నిద్ర కళ్లు వస్తాయి. మీరు కచ్చితంగా రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. లేకపోతే, నడవండి.
విపరీతమైన ఒత్తిడి ఈ రోజుల్లో మనం తరచుగా పని గురించి లేదా వ్యక్తిగత జీవితం గురించి ఆందోళన చెందాల్సి వస్తుంది. ఫలితంగా, ఒత్తిడి హార్మోన్లు బయటకు రావడం ప్రారంభిస్తాయి. రోజంతా నిద్రపోవడానికి ఇది ఒక కారణం. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఐరన్, విటమిన్ బి12, డి వంటి కొన్ని పోషకాల లోపాలు కూడా అలసటకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్లీప్ అప్నియా, హైపోథైరాయిడిజం, క్యాన్సర్, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్, మల్టిపుల్ స్క్లెరోసిస్, కిడ్నీ డిసీజ్, డయాబెటిస్ వంటి అనేక వ్యాధులు అలసటతో సంబంధం కలిగి ఉంటాయి. మీకు దీర్ఘకాలిక అలసట ఉంటే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
అందుకే రోజంతా నిద్ర, అలసట లేకుండా యాక్టివ్‌గా ఉండాలి. ఇందుకోసం మీరు మంచి ఆహారం తీసుకోవాలి. శారీరకంగా, మానసికంగానూ బాగుండాలి. రోజు కచ్చితంగా వ్యాయామం చేయాలి, పౌష్టికాహారం తీసుకోవాలి.