తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunlight -Sleep । ఉదయం పూట కొంత సూర్యరశ్మిని పొందడి, నిద్ర సమస్యలు ఉండవు!

Sunlight -Sleep । ఉదయం పూట కొంత సూర్యరశ్మిని పొందడి, నిద్ర సమస్యలు ఉండవు!

HT Telugu Desk HT Telugu

22 February 2023, 8:44 IST

    • Sunlight -Sleep: ఉదయంపూట కొంత సూర్మరశ్మి గ్రహిస్తే నిద్రలేమి సమస్యలు సహజంగా దూరమవుతాయి. అది ఎలాగో తెలుసుకోండి.
Sunlight -Sleep
Sunlight -Sleep (istock)

Sunlight -Sleep

భూమి మీద ఉన్న జీవుల్లో కొన్ని నిశాచరాలు అయితే, కొన్ని పగటి సంచారులు. మనిషి కూడా రాత్రికంటే, దినంలోనే చురుగ్గా ఉంటాడు. మనం సహజంగానే పగటిపూట చురుగ్గా ఉండటానికి, బయట తిరగటానికి అలాగే రాత్రి నిద్రించడానికి మొగ్గు చూపుతాము శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ అని చెప్పే సహజ గడియారం ఈ తరహాలోనే 24-గంటల రిథమ్‌పై పనిచేస్తుంది. ఇది మానవులు పగటిపూట మెలకువగా, అప్రమత్తంగా ఉండటానికి.. రాత్రి సమయంలో విశ్రాంతిని తీసుకోవడానికి ప్రేరణను ఇస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Patha Chinthakaya Pachadi: పాత చింతకాయ పచ్చడి ఇలా చేసుకున్నారంటే దోశె, ఇడ్లీ, అన్నంలోకి అదిరిపోతుంది

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Cherakurasam Paramannam: పంచదారకు బదులు చెరుకు రసంతో పరమాన్నాన్ని వండి చూడండి, ఎంతో ఆరోగ్యం

Garlic Peel: వెల్లుల్లిని పొట్టు తీసి వాడుతున్నారా? ఎన్ని పోషకాలను నష్టపోతున్నారో తెలుసా?

మీరు ఎలాంటి కారణాలు కేకుండా రాత్రిపూట నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ అస్తవ్యస్తం అవుతుంది. అయితే దీనిని రీసెట్ చేయడానికి సులభమైన మార్గం సూర్యకాంతి.

కాంతి ప్రసరణ ఉన్నప్పుడు శరీరంలోని ప్రధాన సిర్కాడియన్ గడియారం మిమ్మల్ని మేల్కొలిపే ఒక సంకేతంగా భావిస్తుంది. దీనికి వ్యతిరేకంగా చీకటి ఉన్నప్పుడు కళ్లు మూసుకొని నిద్రపోయే సంకేతాలను ఇస్తుంది.

అందువల్ల, మీరు పగటిపూట సూర్యరశ్మికి గురికావడం వలన రోజులో అప్రమత్తంగా ఉండటానికి సహాయపడుతుంది, రాత్రి పడకగదిని చీకటిగా చేయడం వలన మంచి నిద్రకు సహాయపడుతుంది. కాబట్టి ఎప్పుడూ నీడపట్టునే ఉండకుండా అప్పుడప్పుడు కాస్త ఎండలో తిరగటం మంచిది.

ఉదయం వేళ కొంత సూర్యరశ్మిని గ్రహిస్తే, చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

1. మీ నిద్రను మెరుగుపరుస్తుంది

సూర్యరశ్మిని గ్రహించి మీ శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది మీకు నిద్రపోవడానికి కీలకం. మీ శరీరం చీకటిగా ఉన్నప్పుడు ఇది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, సూర్యుడు అస్తమించిన రెండు గంటల తర్వాత నిద్రపోవడం ప్రారంభిస్తారు. వేసవిలో మనం నిద్రపోవడానికి మొగ్గుచూపటానికి కారణం ఇదే.

2. ఒత్తిడిని తగ్గిస్తుంది

మెలటోనిన్ ఒత్తిడి ప్రతిస్పందనలను కూడా తగ్గిస్తుంది. మీరు ఎండలో తిరగటం వల్ల మీ శరీరం సహజంగా మెలటోనిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది, అదనంగా, సూర్యరశ్మి మీ శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది, ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరిచే ఒక రసాయనం. మీరు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది

3. దృఢమైన ఎముకలకు

సూర్యరశ్మికి గురైనప్పుడు మీ శరీరంలోనే సహజంగా విటమిన్ డి ఉత్పత్తి చేస్తుంది. రోజుకు 15 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుంది. విటమిన్ డి మీ శరీరం కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఇది దృఢమైన ఎముకలకు మూలం. మీ రోగనిరోధక వ్యవస్థకు కూడా కీలకం.

అయితే ఈ ఎండాకాలం ఎండలతో జాగ్రత్త. ఎక్కువ ఎండలో తిరగవద్దు. కేవలం 15-30 నిమిషాల మృదువైన సూర్యరశ్మి శరీరానికి సరిపోతుందని నిపుణులు అంటున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం