తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cucumber Eating Mistakes : దోసకాయ తినేటప్పుడు అందరూ ఈ తప్పు చేసి ప్రయోజనాలు కోల్పోతారు

Cucumber Eating Mistakes : దోసకాయ తినేటప్పుడు అందరూ ఈ తప్పు చేసి ప్రయోజనాలు కోల్పోతారు

Anand Sai HT Telugu

21 May 2024, 9:30 IST

google News
    • Cucumber Eating Mistakes In Telugu : మనం చేసే చిన్న చిన్న తప్పులు మన ఆరోగ్యానికి ప్రయోజనాలు లేకుండా చేస్తాయి. చాలా మంది దోసకాయ తినేటప్పుడు చిన్న తప్పు చేస్తారు. దీంతో అసలైన ప్రయోజనాలు కోల్పోతారు.
దోసకాయ
దోసకాయ (Freepik)

దోసకాయ

వేసవిలో దోసకాయలు, నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినడం మంచిది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే, చల్లగా ఉండేవి తింటే శరీరానికి మేలు జరుగుతుంది. వేసవిలో ప్రజలు తప్పనిసరిగా దోసకాయ సలాడ్ తినాలి. సలాడ్‌లో ఎక్కువ ఉపయోగించేది తాజా దోసకాయ. ఇది నీటితో నిండి ఉంటుంది. దోసకాయ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది తింటే మీ శరీరం చల్లబడుతుంది. దీన్ని తినడం వల్ల కడుపు తేలికగా నిండిపోయి శరీరం చల్లగా ఉంటుంది. అనేక విటమిన్లు, ఖనిజాలు కూడా దోసకాయలో కనిపిస్తాయి. కానీ చాలా మంది దోసకాయ తినేటప్పుడు తప్పులు చేస్తారు. దాని వల్ల పూర్తి ప్రయోజనాలు పొందలేరు. మీ పొరపాటు వల్ల శరీరానికి దోసకాయ వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ పోతాయి. దోసకాయ తినేటప్పుడు మీరు ఎలాంటి తప్పులు చేస్తారో తెలుసుకోండి?

నిపుణుల ప్రకారం చాలామంది దోసకాయ తినేటప్పుడు చిన్న పొరపాటు చేస్తారు. దాని వల్ల శరీరానికి పెద్దగా ప్రయోజనం ఉండదు. చాలా మంది దోసకాయలను పొట్టు తీసి తింటారు. కానీ పొట్టు లేకుండా దోసకాయ తింటే ఉపయోగం ఏమీ ఉండదు. విటమిన్ ఎ అంటే బీటా కెరోటిన్, విటమిన్ కె దోసకాయ తొక్కలో ఉంటాయి. ఇది శరీరం, జుట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది.

జీర్ణక్రియకు మంచిది

మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడేవారు దోసకాయను పొట్టు లేకుండా తినాలి. దోసకాయ తొక్కలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పేగు కదలికలను మెరుగుపరచడానికి, కడుపుని శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడం

పొట్టు లేకుండా దోసకాయ తింటే దానిలోని కేలరీలు మరింత తగ్గుతాయి. దోసకాయ తొక్కలు ఫైబర్, రౌగేజ్ కంటెంట్‌ను పెంచుతాయి. అంటే పీచు పదార్థం అన్నమాట. దోసకాయ పొట్టు లేకుండా తింటే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది ఆహార కోరికలను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది

దోసకాయ తినడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. కానీ దోసకాయ తొక్కలో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని ఆక్సీకరణం చెందకుండా కాపాడతాయి.

విటమిన్ ఎ, కె పుష్కలంగా

దోసకాయ తొక్కలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు బీటా కెరోటిన్ పొందాలనుకుంటే పొట్టుతోనే దోసకాయలను తినండి. దోసకాయ తొక్కలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడం విషయంలో మీకు సహాయపడుతుంది. విటమిన్ కె ఎముకలను బలపరుస్తుంది.

దోసకాయ ఆరోగ్యానికి ఎంతోమంచిది. దాని ఉత్తమ ఫలితాలను పొందాలనుకుంటే.. మీరు కచ్చితంగా తొక్కతోనే తినాలి. లేదంటే చాలా ప్రయోజనాలు మిస్ అవుతారు. దోసకాయ మీ జీర్ణక్రియకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. దాని పూర్తి ప్రయోజనాలు పొందాలంటే తొక్కతోనే తినాలి. చాలా మంది తొక్క తిసేసి తింటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దోసకాయతో మీ చర్మానికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీనిని మెుత్తం తింటేనే ఉపయోగం ఉంటుంది. పొట్టు లేకుండా దోసకాయ తినకండి.

తదుపరి వ్యాసం