విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే 5 బియ్యం రకాలివే!
pexels
By Bandaru Satyaprasad May 18, 2024
Hindustan Times Telugu
మనం సాధారణంగా వైట్ రైస్ ఎక్కువగా తింటుంటాం. అయితే, బియ్యంలో ఇంకా అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న 5 రకాల బియ్యం గురించి తెలుసుకుందాం.
pexels
రెడ్ రైస్ - ఈ రైస్ ఎరుపు రంగులో ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, జింక్ వంటి మినరల్స్ ఉంటాయి. దీంతో పాటు సెలీనియం ఉంటుంది. రెడ్ రైస్ అనేక వ్యాధుల నుంచి రక్షించడంతో సహాయపడుతుంది.
pexels
బ్లాక్ రైస్- బ్లాక్ రైస్ కొద్దిగా తీపి రుచిలో ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బ్లాక్ రైస్ గుండె ఆరోగ్యానికి మేలు చేసుతుంది. ఇందులోని విటమిన్ ఈ కంటి ఆరోగ్యానికి మంచిది.
pexels
వైట్ రైస్ - వైస్ రైస్ అత్యంత సాధారణంగా వినియోగించే బియ్యం రకం. బ్రౌన్ లేదా రెడ్ రైస్ తో పోలిస్తే ఇందులో పోషకాలు తక్కువగా ఉంటాయి. వైట్ రైస్ లో కార్పోహైడ్రేట్ లు పుష్కలంగా ఉంటాయి.
pexels
బ్రౌన్ రైస్
pexels
బ్రౌన్ రైస్ లో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో డయాబెటిస్ ఉన్న వారు వినియోగిస్తారు. గుండె ఆరోగ్యానికి మంచిది.
pexels
సుషీ రైస్ -జపనీస్ షార్ట్-గ్రెయిన్ రైస్ అని దీనిని పిలుస్తారు. సుషీ రైస్ జిగటగా ఉంటుంది. రోలింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ రైస్ కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి, శక్తి ఉత్పత్తికి సాయపడుతుంది.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి