తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Glowing Skin Secrets : ఈ సింపుల్ చిట్కాలతో అందమైన, మెరిసే స్కిన్ మీ సొంతం

Glowing Skin Secrets : ఈ సింపుల్ చిట్కాలతో అందమైన, మెరిసే స్కిన్ మీ సొంతం

06 September 2022, 11:46 IST

    • Fair and Glowing Skin : బయటకు వెళ్లినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ తీసుకున్న దాని ప్రభావం ముందు స్కిన్​ మీదే పడుతుంది. అది మీ చర్మాన్ని నల్లగా చేస్తుంది. అంతే కాకుండా మీ స్కిన్ నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.
మెరిసే చర్మం కోసం ఇంటి చిట్కాలు
మెరిసే చర్మం కోసం ఇంటి చిట్కాలు

మెరిసే చర్మం కోసం ఇంటి చిట్కాలు

Fair and Glowing Skin : సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల లేదా ట్రాఫిక్ కాలుష్యం వల్ల హైపర్పిగ్మెంటేషన్, సన్ టాన్ ఏర్పడుతుంది. పైగా ఈ వర్షాకాలంలో కూడా వేడి ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల మీ చర్మం ముదురు రంగులో మారే అవకాశముంది. అధిక సూర్యరశ్మి వలన హైపర్పిగ్మెంటేషన్, సన్బర్న్, డార్క్ స్పాట్స్ ఏర్పడవచ్చు. అయితే కొన్ని ఇంటి నివారణల సహాయంతో.. ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Parenting Tips : కుమార్తెలు భయపడకుండా జీవించేందుకు తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు

Turmeric Water Benefits : వేడి నీటిలో పసుపు కలిపి తాగితే ఈ 7 సమస్యలు రాకుండా ఉంటాయి

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 8 అంకెల మధ్య 3 అంకె దాక్కొని ఉంది, అదెక్కడుందో 10 సెకన్లలో కనిపెట్టండి

Chicken Chinthamani Recipe : చికెన్ చింతామణి.. ఒక్కసారి ట్రై చేయండి.. రుచి సూపర్

నిమ్మ, తేనె

ఒక టేబుల్ స్పూన్ తేనెతో తాజా నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని మీ చర్మానికి అప్లై చేసి.. 20 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం గోరు వెచ్చని నీటితో లేదా చన్నీళ్లతో కడిగేయండి. ఇలా తరచూ చేస్తుంటే టాన్ తొలగిపోతుంది.

శెనగపిండి

శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపండి. దానిని ఒక మృదువైన పేస్ట్ చేయండి. దానిని మీ చర్మంపై అప్లై చేయండి. 15 నిమిషాలు ఆరనిచ్చి.. ఆపై దానిని కడగాలి. ఈ చిట్కాను చాలామంది ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు. ఫలితాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి.

పండ్లు, కూరగాయలు

పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

కొబ్బరి పాలు

కొబ్బరి పాలలో దూదిని నానబెట్టండి. దానిని 15 నిమిషాలు అలాగే ఉంచి.. అనంతరం దానితో శరీరాన్ని లేదా టాన్ ఉన్న ప్రదేశాన్ని ప్యాక్ చేసి.. తర్వాత దానిని చన్నీటితో కడగండి. కొబ్బరి పాలు టాన్ రిమూవ్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా చర్మానికి మంచి రక్షణ, పోషణ అందిస్తాయి. అందుకే చాలా బ్యూటీ ప్రొడెక్ట్స్​లో కొబ్బరిపాలు ఉపయోగిస్తారు.

కలబంద

అలోవెరా జెల్ తీసుకుని చర్మానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. కలబంద గుజ్జులో పసుపు కలిపి రాసుకున్న మెరుగైన ఫలితాలు ఉంటాయి.

టాపిక్

తదుపరి వ్యాసం