Breakfast Recipe : బంగాళదుంపతో చేసే ఉతప్పం.. తింటే మీకు తృప్తి ఖాయం
Potato Uthappam : టిఫెన్స్లో ఉతప్పానికి ఉండే క్రేజే వేరు. అయితే రోటీన్ ఉతప్పానికి బాయ్ చెప్పి.. బంగాళదుంపతో చేసే ఉతప్పాన్ని ట్రై చేయండి. కొన్ని కూరగాయాలు కూడా ఈ ఉతప్పాంలో ఉపయోగిస్తాము కాబట్టి.. అవి మీ టేస్ట్‌ను మరింత పెంచుతాయి. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ అదే కావాలి అనేంతలా ఉంటుంది దాని టేస్ట్.
Potato Uthappam : ఉదయాన్నే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్‌తో రోజును ప్రారంభిస్తే అబ్బబ్బా. ఆ ఊహ ఎంత బాగుంది. పైగా మన అల్పాహారాన్ని మంచి వేడి వేడి ఉతప్పంతో లాగిస్తే.. ఇంక మాటలేమి ఉంటాయి గురువు గారు. అయితే బంగాళదుంపతో తయారు చేసే ఉతప్పానికి కూడా అంతే క్రేజ్ ఉందంటే నమ్ముతారా? పైగా ఇది మీకు మరింత ఎక్కువ టేస్ట్‌ని ఇస్తుంది. ఆలు పిండికి మంచి ఆకృతిని ఇస్తుంది. కూరగాయలు ఉతప్పం రుచిని మరింత మెరుగ్గా చేస్తాయి. దీనిని సాంబార్ లేదా చట్నీతో కూడా హాయిగా లాగించేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
* బియ్యం - 1 కప్పు
* బంగాళదుంపలు - 2 (ఉడికించినవి)
* ఉల్లిపాయ - 1 (తరిగినది)
* క్యారెట్ - 1(తరిగినది)
* క్యాబేజి - కొంచెం (తరిగినది)
* క్యాప్సికమ్ - 1 (తరిగినది)
* పచ్చిమిర్చి - 1 (తరగాలి)
* అల్లం - 1 స్పూన్ (తరగినది)
* కారం - 1 స్పూన్
* ఉప్పు - తగినంత
తయారీవిధానం
ఆలూ ఉతప్పం చేయడానికి ముందుగా బియ్యాన్ని ఐదు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని, ఉడకబెట్టిన బంగాళాదుంపలను, అల్లం, పచ్చి మిరపకాయలను బ్లెండర్‌లో వేసి మిక్సి చేయాలి. నీరు పడితే కాస్త వేయండి. అది పిండిలాగా సిద్ధమైనప్పుడు దానిని పెద్ద గిన్నెలోకి మార్చండి.
ఆ మిశ్రమంలో క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలను వేయండి, కారం, ఉప్పు వేసి మరోసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై దోశ పాన్ ఉంచండి. అది వేడైన తర్వాత.. పిండిని ఉతప్పంలా వేసుకోవాలి. రెండువైపులా మంచి గోల్డెన్ రంగు వచ్చేవరకు కాల్చి.. మంచి చట్నీతో లాగిస్తే.. ఆహా అనేస్తారు.
సంబంధిత కథనం