Breakfast Recipe : మనసుకు హాయినిచ్చే.. హవాయి బొప్పాయి సలాడ్..
Hawai Papaya Salad : గుండె జబ్బుల నివారణకు బొప్పాయిలు చాలా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ వంటి జ్వరాలకు బొప్పాయి చాలా సహాయం చేస్తుంది. దీనిని రెగ్యూలర్ బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే.. మీ హెల్త్‌కి కూడా చాలామంచిది. దీనిని వెరైటీగా తీసుకోవాలి అనుకుంటే హవాయి బొప్పాయి సలాడ్ ట్రై చేయండి.
Hawai Papaya Salad : వర్షాకాలంలో ఆరోగ్యకరమైన తాజా హవాయి బొప్పాయి సలాడ్ తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. బొప్పాయిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి, విటమిన్ ఎ లతో కూడిన అద్భుతమైన మూలం. ఇది మీకు విటమిన్‌లను అందిస్తూ.. రుచికరంగా మీ కడుపు నింపడానికి సరైన బ్రేక్‌ఫాస్ట్. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
కావాల్సిన పదార్థాలు
బొప్పాయి - 1 చిన్నది
నిమ్మకాయ రసం - 2 స్పూన్స్
పుచ్చకాయ ముక్కలు - 3 కప్పు
పైనాపిల్ ముక్కలు - 2 కప్పులు
కొబ్బరి - 1 చిన్న కప్పు (తరిగినది)
వెనిల్లా ఫ్లేవర్డ్ యోగర్ట్ - 3 కప్పులు
తయారీ విధానం
బొప్పాయి పైన తొక్కను తీసి.. చిన్న ముక్కలుగా కట్ చేసి.. నిమ్మరసంతో కలపండి. పుచ్చకాయ, పైనాపిల్, కొబ్బరితో కూడా వేసి బాగా కలపండి. దానిలో వెనిల్లా ఫ్లేవర్డ్ పెరుగు వేసి బాగా కలపండి. దానిలో విత్తనాలు. దీనిని సర్వింగ్ బౌల్ లేదా పైనాపిల్ షెల్స్‌లో వేసి సర్వ్ చేయండి. ఇది మీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా మంచి ఆహారం. పైగా హెల్త్‌కి చాలా మంచిది.
సంబంధిత కథనం