Tomato Dosa | కొంచెం ట్యాంగీ, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో దోశ ఎప్పుడైనా తిన్నారా?!-have tangy and tasty tomato dosa in the breakfast recipe is here ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Have Tangy And Tasty Tomato Dosa In The Breakfast, Recipe Is Here

Tomato Dosa | కొంచెం ట్యాంగీ, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో దోశ ఎప్పుడైనా తిన్నారా?!

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 09:21 AM IST

దోశల్లో చాలా వెరైటీలు ఉన్నాయి. అందులో టొమాటో దోశ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎర్రటి రంగులో ట్యాంగీ ఫ్లేవర్ కలిగి ఉండే ఈ దోశను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ రెసిపీ ఉంది.

Tomato Dosa
Tomato Dosa (Twitter)

దోశ అనేది ఇండియాలో చాలా మందికి ఇష్టమైన అల్పాహారం. మీరు ఇప్పటివరకు అనేక రకాల దోశలు తినే ఉంటారు. మసాలా దోశ, రవ్వదోశ, పనీర్ దోశ ఇవి ఎక్కువగా తినేవే. అయితే ఎప్పుడైనా టొమాటో దోశ తిన్నారా? ఇది చాలా రుచికరంగా ఉంటుంది. కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ దోశను కూడా రెండు రకాలుగా చేసుకోవచ్చు. అయితే ఇన్‌స్టంట్‌గా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఆదివారం కాస్త బద్ధకంగా అనిపించినప్పటికీ ఆలస్యంగానైనా పనులు చేసుకోవాలని ఉంటుంది. ఓపికగా ఇష్టమైన వంటలు చేసుకోవటానికి సమయం ఉంటుంది. కొత్తకొత్త వంటకాలు ప్రయోగాలు చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు కొత్తగా టొమాటో దోశ ట్రై చేయండి. ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ దోశలో రవ్వను కలపాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త క్రిస్పీగా ఉంటుంది. అయినప్పటికీ పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. మధ్యాహ్నం విందు భోజనం వరకు మిమ్మల్ని నిండుగా కూడా ఉంచుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని ఇక్కడ తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు

  • 3-4 టొమాటోలు
  • 1 కప్పు బియ్యం పిండి
  • 1 కప్పు రవ్వ
  • 1/4 కప్పు గోధుమ పిండి
  • 1/2 టీస్పూన్ వంట సోడా
  • 1/2 అల్లం పేస్ట్
  • 3-4 ఎండు మిర్చి
  • 1/4 టీస్పూన్ జీలకర్ర
  • తాజాకొత్తిమీర 2-3 టీస్పూన్లు
  • ఉప్పు రుచికి తగినట్లుగా
  • దోశలు వేయించటానికి నెయ్యి లేదా నూనె
  • నీరు

తయారీ విధానం

  1. ముందుగా ఒక బ్లెండర్లో పెద్దగా కోసిన టొమాటో ముక్కలు, ఎండు మిర్చి, అల్లంపేస్ట్ వేసి కొన్ని నీళ్లుపోసుకొని ప్యూరీలాగా మారేవరకు గ్రైండ్ చేసుకొండి.
  2. ఇప్పుడు ఈ టోమాటో ప్యూరీని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇందులో బియ్యం పిండి, రవ్వ, గోధుమ పిండి, జీలకర్ర, వంట సోడా, కొత్తిమీరా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమం పలుచగా ఉండాలి కాబట్టి కావాల్సినన్నీ సుమారు 2-3 కప్పులు నీరు పోసుకోండి.
  3. అన్నీ వేశాక 10 నిముషాలు అలాగే ఉండనివ్వండి. దాదాపు పది నిమిషాల తర్వాత మీ ఇన్‌స్టంట్ టొమాటో దోశ పిండి ఇప్పుడు సిద్ధంగా ఉంది.
  4. ఇప్పుడు స్టవ్ మీద తవా వేడి చేసుకోండి. దోశ పాన్‌పై కొంచెం నీరు చిలకరించాలి. అది సిజ్లింగ్ అయితే, దోశ చేయడానికి మీకు సరైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఇపుడు ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యిని తవాపై పరిచి ఒక చిన్న గిన్నె ద్వారా పలుచటి దోశపిండిని తీసుకొని తవా మీద దోశలాగా విస్తరించండి.
  5. అన్ని వైపులా కొన్ని చుక్కల నూనె లేదా నెయ్యి వేసి దోశ క్రిస్పీగా, గోధుమ రంగులోకి మారేంత వరకు కాల్చండి.

ఇప్పుడు దోశను జాగ్రత్త తవా మీద నుంచి తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వేడివేడి టొమాటో దోశ రెడీ. కొబ్బరి చట్నీ, సాంబారుతో కలిపి లాగించే\యండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్