తెలుగు న్యూస్  /  Lifestyle  /  Eating Water-rich Vegetable Bottle Gourd In Summer Is Super Healthy, Bottle Gourd Curd Curry Recipe Inside

Bottle Gourd Curd Curry Recipe । సోరకాయ పెరుగు కూర.. వేసవిలో తప్పకుండా తినాలి!

HT Telugu Desk HT Telugu

30 May 2023, 13:07 IST

    • Bottle Gourd Curd Curry Recipe: వేసవిలో సోరకాయ తినడం వలన శరీరానికి సరైన హైడ్రేషన్ లభిస్తుంది. సోరకాయను పెరుగుతో కలిపి చేసుకోవడం వలన ఒంటికి చలువ కూడా చేస్తుంది. సోరకాయ పెరుగుకూర రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం.
Bottle Gourd Curd Curry Recipe:
Bottle Gourd Curd Curry Recipe: (slurrp)

Bottle Gourd Curd Curry Recipe:

Healthy Summer Recipes: సోరకాయ లేదా ఆనపకాయ అనేది ఏ సీజన్ లో అయినా విరివిగా లభించే ఒక ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిలో నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉంటుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌ సమస్యలతో బాధపడేవారు సోరకాయలను ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. సోరకాయల్లో కోలిన్‌ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్‌ ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీపీని నియంత్రించడంలోనూ సోరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. సోడియం, పొటాషియం, ఇతర ముఖ్యమైన మినరల్స్‌ ఉంటాయి. అందువల్ల హైబీపీ ఉన్నవారికి మంచి కూరగాయ, ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది కాబట్టి మధుమేహం ఉన్నవారు సోరకాయ తినాలి.

వేసవిలో సోరకాయ తినడం వలన శరీరానికి సరైన హైడ్రేషన్ లభిస్తుంది. సోరకాయను పెరుగుతో కలిపి చేసుకోవడం వలన ఒంటికి చలువ కూడా చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని కూడా చల్లగా ఉంచుకోవచ్చు. సోరకాయ పెరుగుకూర రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ వేసవికాలంలో మీరు ట్రై చేయండి.

Bottle Gourd Curd Curry Recipe కోసం కావలసినవి

  • 1 సోరకాయ
  • 1 అంగుళం దాల్చిన చెక్క
  • 2-3 ఏలకులు
  • 3-4 లవంగాలు
  • 1/2 టీస్పూన్ వాము
  • 1/2 టీస్పూన్ అల్లం
  • 1 టీస్పూన్ ఫెన్నెల్ పౌడర్
  • 1/4 టీస్పూన్ ఇంగువ
  • 1 కప్పు పెరుగు
  • 2 టేబుల్ స్పూన్ ఆవాల నూనె
  • ఉప్పు రుచికి తగినంత

సోరకాయ పెరుగుకూర తయారీ విధానం

  1. ముందు సోరకాయను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోండి, మిగతా పదార్థాలను సిద్ధం చేసుకోండి.
  2. మొదటగా ఒక తవాలో అర టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. ఆపై సోరకాయ ముక్కలు వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. పూర్తయిన తర్వాత వాటిని పక్కన పెట్టండి.
  3. అదే బాణలిలో మరికొంత నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, వాము వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి.
  4. ఇప్పుడు మంట తక్కువ చేసి కొన్ని నీళ్ళు పోసి, నీటిని మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు సోరకాయ ముక్కలు,అల్లం పొడి, సోపు పొడి, ఇంగువ వేసి బాగా కలపాలి.
  5. ఇప్పుడు పెరుగును ఒక గిన్నెలోకి బాగా గిలక్కొట్టి లౌకి కూరలో వేసి కలపండి. మీడియం మంటలో కూర చిక్కగా వచ్చేవరకు ఉడికించాలి.
  6. కూర ఉడుకుతున్నపుడు రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలిపి అలాగే ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి.

చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సోరకాయ పెరుగుకూర రెడీ. అన్నం లేదా పరాఠాలతో తింటే అద్భుతంగా ఉంటుంది.