తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Potato Juice Benefits : బంగాళాదుంపల రసాన్ని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Potato Juice Benefits : బంగాళాదుంపల రసాన్ని తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

27 September 2022, 14:06 IST

google News
    • Potato Juice Benefits : మనలో చాలామంది బంగాళదుంపలను ఇష్టంగా తింటారు. వాటికి ఉడికించి, కాల్చిన, వేయించిన, సలాడ్‌లలో కూడా తీసుకుంటారు. ముఖ్యంగా ఆలుతో చేసే చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్​కి చాలామంది అభిమానులున్నారు. అయితే బంగాళదుంప జ్యూస్ తాగారా. దీనిని తీసుకుంటే మీ శరీరం ఎన్నో ప్రయోజనాలు పొందుతుంది అంటున్నారు ఆహార నిపుణులు.
బంగాళా దుంప జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు
బంగాళా దుంప జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు

బంగాళా దుంప జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలు

Potato Juice Benefits : బంగాళా దుంపలు నీరు, ఫైబర్​కు మంచి మూలం. దీనిలోని కార్బోహైడ్రేట్ల గొప్ప వనరు అని చెప్పవచ్చు. అంతేకాకుండా దీనిలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ ఉన్నాయి. అందుకే ఇవి మీ జుట్టు, చర్మానికి చికిత్స చేయడానికి మంచిది. కాబట్టి దీనిని జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ జ్యూస్ ఇతర అద్భుతమైన ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది కాబట్టి. అదనంగా వాటిలో విటమిన్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ కూడా ఉన్నాయి. అయితే రోజూ ఉదయం, సాయంత్రం బంగాళదుంప రసం తాగడం వల్ల మీ శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళా దుంప జ్యూస్​ వల్ల కలిగే ప్రయోజనాలు

* సహజ శోథ నిరోధక.

* హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

* ఎనర్జిటిక్​గా ఉంచుతుంది.

* కళ్లు, చర్మం, దంతాల ఆరోగ్యం, నాడీ వ్యవస్థ కూడా మెరుగవుతుంది.

* అజీర్తికి తోడ్పడుతుంది.

* చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

* ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

* అకాల వృద్ధాప్యం.

* మెరుగైన రోగనిరోధక వ్యవస్థ.

దీనిని ఎలా తయారు చేయాలంటే..

ఈ బంగాళ దుంపు జ్యూస్ తయారు చేయడానికి.. మొలకలు లేని మూడు బంగాళాదుంపలు, 1 కప్పు నీరు అవసరం. బంగాళాదుంపలను పీల్ చేసి ముక్కలుగా కట్ చేసి, బ్లెండర్లో చేయాలి. దానిలో అర కప్పు నీటిని వేసి మళ్లీ బ్లెండ్ చేయండి. దానిని రెండు భాగాలుగా చేసి.. (ఒక్కొక్కటి సగం కప్పు) ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి ఉదయం ఒకటి, రాత్రి మరొకటి తాగాలి.

నోట్ : బంగాళాదుంప జ్యూస్ తాగేముందు.. మీ వైద్యుని సలహా తీసుకుని.. అప్పుడు ప్రారంభించండి.

టాపిక్

తదుపరి వ్యాసం