తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Weight Loss With Potato: బంగాళదుంపలు ఇలా తింటే బరువు తగ్గిపోతారంటా..

Weight Loss With Potato: బంగాళదుంపలు ఇలా తింటే బరువు తగ్గిపోతారంటా..

01 July 2022, 16:28 IST

బరువు పెరిగిపోతామని చాలామంది బంగాళదుంపలను తినరు. కానీ బంగాళ దుంపలు తింటే బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు. మరి వాటిని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతామో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బరువు చాలా సమస్యలను తెస్తుంది. అందుకే సన్నగా ఉండేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. దానిలో భాగంగా కొన్ని ఆహారాలను మానేస్తాము. వాటిలో బంగాళాదుంప ముందు ఉంటుంది. బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు కాబట్టి చాలా మంది దానిని తినరు. కానీ బరువు తగ్గడానికి బంగాళదుంపలు చాలా బాగా ఉపయోగపడతాయని అంటున్నారు నిపుణులు.
(1 / 5)

బంగాళదుంపలు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇవి పొట్టలోని కొవ్వును తగ్గించడమే కాకుండా.. జీర్ణక్రియకు సహాయపడతాయి. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి బరువు నియంత్రణకు కూడా మంచివి. ఎందుకంటే అవి కొవ్వు రహితంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(2 / 5)

ఉడికించిన బంగాళదుంపలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చు. బరువు తగ్గాలంటే ఉడికించిన బంగాళదుంపలను తినాలి. ఎందుకంటే ఉడకబెట్టిన బంగాళదుంపలు చాలా సేపు మీకు కడుపు నిండిలా చేస్తాయి. సులభంగా ఆకలి వేయదు. ఒక అధ్యయనం ప్రకారం.. ఉడికించిన చల్లని బంగాళదుంపలు అధిక స్థాయిలో రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి, ఇది జీవక్రియను పెంచడానికి, అదనపు కొవ్వును తగ్గిస్తుంది.
(3 / 5)

బంగాళదుంపలు తినడం అంటే వేయించిన లేదా టిక్కీ తినడం కాదు. ఎందుకంటే ఏదైనా పౌష్టికాహారాన్ని వేయించినట్లయితే, దాని నాణ్యత కొంతవరకు పోతుంది. అంతేకాకుండా నూనెలో వేయించినవి తినడం వల్ల బరువు కూడా పెరుగుతారు.
(4 / 5)

బంగాళాదుంపలను ఉడకబెట్టిన తరువాత.. వాటిని పూర్తిగా చల్లబరచండి. వాటిపై తొక్కను తీసేసి.. వాటిని ముక్కలుగా కట్ చేసుకోండి. దాని రుచిని మెరుగుపరచడానికి నల్ల మిరియాలు కూడా వేయవచ్చు. మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనంలో కూడా పెరుగు లేదా మజ్జిగతో దీనిని తీసుకోండి. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి