Dreaming Sex । కలలో శృంగారం.. మగవారికి అలా, ఆడవారికి ఇలా!
16 March 2023, 21:09 IST
- Dreaming Sex: మీరు కలలో ఎప్పుడైనా శృంగారం చేస్తున్నట్లు అనిపించిందా? ఇది స్త్రీ, పురుషులిద్దరికీ విభిన్నంగా ఉంటుందట. సెక్స్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చూడండి.
Dreaming Sex
Dreaming Sex: నిద్రలో కలలు రావడం సాధారణ విషయం, అందులో శృంగారం చేస్తున్నట్లు కలలు రావడం కూడా సహజమే. అయితే ఇలా శృంగారం చేస్తున్నట్లుగా కలలు రావడం అందరికీ ఒకేలా ఉండదు. ముఖ్యంగా మగవారికి ఒకలా వస్తే, ఆడవారికి మరో రకంగా కలలు వస్తాయట.
సెక్స్ అనేది ఆహ్లాదకరమైన కోరిక, భావప్రాప్తి పొందడంతో ఈ కోరిక సంతృప్తి చెందుతుంది. అది కలలో అయినా అంతే. జనాలు సెక్స్ గురించి చాలా తక్కువగా మాట్లాడతారు, ఎందుకంటే శృంగారం, సంభోగం గురించి తమకు అన్నీ తెలుసునని ప్రజలు నమ్ముతారు. కానీ సెక్స్ గురించి మీకు అంతగా తెలియని కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయనడంలో సందేహం లేదు. మరి ఆ శృంగారభరితమైన విశేషాలను మీరూ తెలుసుకోండి.
కలలో శృంగారం చేయడం
అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ పరిశోధన ప్రకారం, కలలో శృంగారం చేయడం అందరికీ ఒకేలా ఉండదు. పురుషులు, మహిళలు విభిన్న లైంగిక అంశాలను కలిగి ఉండే కలలను కలిగి ఉంటారు. పురుషులు తమ జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులతో శృంగారం చేస్తున్నట్లు, ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటున్నట్లు, అందమైన అమ్మాయిలతో శృంగారం చేస్తున్నట్లు కలలో ఊహించుకుంటారు. మహిళలు మాజీ ప్రేమికులు లేదా వారి ప్రస్తుత భాగస్వాములతోనే సెక్స్ చేస్తున్నట్లు కలలు కంటారు. అలాగే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులతోనూ సెక్సులో పాల్గొంటున్నట్లు ఊహించుకుంటారు.
సెక్స్ తలనొప్పిని నయం చేస్తుంది
వేక్ ఫారెస్ట్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం, నమ్మదగని విధంగా తలనొప్పిని నయం చేస్తుంది. కానీ, లైంగిక కోరికలు పెరగటం వలన మైగ్రేన్ తలనొప్పికి దారితీయవచ్చు. మెదడులోని రసాయనాల ప్రభావమే ఇందుకు కారణం. ఎక్కువ మంది మైగ్రేన్ బాధితుల్లో లైంగిక కోరికలు హెచ్చుగా ఉన్నట్లు ఆ పరిశోధన పేర్కొంది.
సాక్సులు ధరిస్తే భావప్రాప్తి
గ్రోనింగెన్ విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, సంభోగం సమయంలో సాక్స్ ధరించడం వలన భావప్రాప్తి వచ్చే అవకాశాలు పెరుగుతాయి, అయితే ఇందుకు కచ్చితమైన కారణం అస్పష్టంగా ఉంది. ముఖ్యంగా మహిళల్లో చల్లని పాదాలుగమానసిక స్థితిని ప్రభావితం చేయగలవు, పాదాలు వెచ్చగా ఉన్నప్పుడు ఎక్కువ భావప్రాప్తి పొందుతారు. సాక్సులు ధరించడం ద్వారా ఆ వెచ్చదనం లభిస్తుంది.
లైంగిక కోరిక కోల్పోవడం
స్త్రీలు చాలా కాలం పాటు సెక్స్ చేయకుండా ఉంటే, వారు సహజమైన లైంగిక కోరికలను కోల్పోయే అవకాశం ఉంది. క్లిటోరల్ అట్రోఫీ ఆనేది స్త్రీగుహ్యాంకురానికి తగినంత రక్త ప్రసరణ లభించనపుడు సంభవించే ఒక వైద్య పరిస్థితి. దీని ఫలితంగా క్లిటోరిస్ వారి శరీరంలోకి ఉపసంహరించుకుపోతుంది. అప్పుడు శృంగారంపై అనాసక్తి, లైంగిక కోరికలు లేకపోవడం జరుగుతుంది.
స్త్రీలకే భావప్రాప్తి ఎక్కువ
కాలిఫోర్నియాకు చెందిన సెంటర్ ఫర్ మ్యారిటల్ అండ్ సెక్సువల్ స్టడీస్‌కు చెందిన నివేదికల ప్రకారం, శృంగార సమయంలో స్త్రీ, పురుషులిద్దరిలో స్త్రీలకే భావప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఒక స్త్రీ ఒక గంటలో 134 సార్లు భావప్రాప్తి పొందుతుంది, ప్రతి నిమిషానికి 2.2 సార్లు భావప్రాప్తి అనుభూతి చెందుతుంది. అయితే పురుషులు ఒక గంటలో గరిష్టంగా 16 సార్లు మాత్రమే భావప్రాప్తి పొందుతారని ఆ నివేదిక వెల్లడించింది.