Walking: వాకింగ్ ఎక్కువ చేస్తే కీళ్లు అరిగిపోతాయా? మార్నింగ్ వాక్ చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఇదిగో
17 August 2024, 9:30 IST
- Walking: వాకింగ్ ఆరోగ్యకరమైన వ్యాయామం. అయితే కొందరిలో అధికంగా నడిస్తే కీళ్లు అరిగిపోతాయనే భావన ఉంది. ఇది ఎంతవరకు నిజమో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
అధికంగా వాకింగ్ చేస్తే ఏమవుతుంది?
Walking: ఏ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వాకింగ్ చేయమని చెబుతారు వైద్యులు. అలాగే మార్నింగ్ వాక్‌కు వెళుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. కొంతమంది ప్రజల్లో మాత్రం అధికంగా వాకింగ్ చేయడం వల్ల మోకాళ్లు బలహీనంగా మారుతాయనే భావన ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
ఇలా వాకింగ్ చేయాలి
వైద్యులు చెబుతున్న ప్రకారం వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళకు, కీళ్ళకు ఎలాంటి నష్టం ఉండదు. ముందు నెమ్మదిగా నడవడం ప్రారంభించాలి. ఆ తర్వాతే వేగాన్ని పెంచాలి. మోకాళ్ళను వాకింగ్‌కు రెడీ చేయాలంటే కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు చేయాలి. ఇది శరీర కదలికలను సర్దుబాటు చేస్తాయి. అలాగే శరీరాన్ని కాళ్ళను ఎక్కువసేపు నడవడానికి సిద్ధంగా ఉంచుతాయి. కాబట్టి మీ శరీరాన్ని వాకింగ్‌కి రెడీ చేసేముందు స్ట్రెచింగ్ చేయడం మర్చిపోవద్దు.
మంచి షూలను ఎంపిక చేసుకోవాలి
ఎక్కువసేపు వాకింగ్ చేయడం వల్ల మీ కాళ్లకు, మోకాళ్ళకు, కీళ్ళకు, పాదాలకు ఏమీ కాకుండా ఉండాలంటే సౌకర్యవంతమైన షూలను ధరించాలి. మంచి నాణ్యత గల షూలను తీసుకోవాలి. రన్నింగ్ షూస్, మంచి గేర్ ఉన్న షూలను తీసుకోవడం వల్ల మోకాళ్ళకూ, పాదాలకూ మంచి రక్షణ లభిస్తుంది. అసౌకర్యంగా ఉన్న షూలతో ఎక్కువ దూరం నడవలేరు. అలా నడిచినా కూడా పాదాలు బొబ్బలెక్కే అవకాశం ఉంది. ఆ ప్రభావం మోకాళ్ళపై కూడా పడుతుంది.
గతంలో పాదాలకూ, మోకాలికి, కీళ్ళకు గాయాలైన సందర్భాలు ఉంటే మీరు 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ మార్నింగ్ వాక్ చేయడం మంచిది కాదు. మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి మెట్లు ఎక్కడం, దిగడం వంటివి చేయాలి. అలాగే కీళ్లని పటిష్టం చేయడానికి అంజీర్, బాదం పప్పులు, చికెన్ బోన్ సూప్, మటన్ బోన్ సూప్ వంటివి తినాలి.
మోకాళ్ళనూ, కీళ్ళనూ రక్షించుకోవాలంటే ముందుగా అదనపు బరువును తగ్గించుకోవాలి. మీ శరీరంలోని అధిక బరువు మీ మోకాళ్ళ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే మీ శరీర బరువును మోసేది కాళ్లే. వ్యాయామంతో పాటు ఆహారంలో కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా అతను బరువును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గడానికి ముందు నెమ్మదిగా వాకింగ్ చేయడం ప్రారంభించిన తర్వాత ఒక స్థిరమైన వేగాన్ని అందుకోండి. ఒకసారి వేగంగా ఒకసారి నెమ్మదిగా ఇలా మార్చే కన్నా నడక వేగాన్ని స్థిరంగా ఉంచడం వల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది.
వాకింగ్ చేసేటప్పుడు కాళ్లు, మోకాలు, కీళ్లు అధిక నొప్పిగా అనిపిస్తే వెంటనే వైద్యులను కలవండి. వాకింగ్ అలవాటు చేయడానికి ముందుగా ట్రెడ్‌మిల్ పై నడిస్తే మంచిది. ఇది మీ కాళ్ళను, మోకాళ్ళను, కీళ్ళను వాకింగ్‌కు అలవాటు చేస్తుంది. దీనివల్ల ఎలాంటి నష్టము రాదు.