Running: బయట రన్నింగ్ చేయడం Vs ట్రెడ్‌మిల్ రన్నింగ్... ఈ రెండింటిలో ఏది బెటర్-running running outside vs treadmill running which is better ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Running: బయట రన్నింగ్ చేయడం Vs ట్రెడ్‌మిల్ రన్నింగ్... ఈ రెండింటిలో ఏది బెటర్

Running: బయట రన్నింగ్ చేయడం Vs ట్రెడ్‌మిల్ రన్నింగ్... ఈ రెండింటిలో ఏది బెటర్

Haritha Chappa HT Telugu
Jan 20, 2024 05:30 AM IST

Running: బరువు తగ్గేందుకు ఎక్కువమంది రన్నింగ్ చేస్తుంటారు. కొంతమంది ట్రెడ్ మిల్ పై పరిగెడుతూ ఉంటారు. ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

రన్నింగ్ తో ఉపయోగాలు
రన్నింగ్ తో ఉపయోగాలు (Pixabay)

Running: బరువు తగ్గడానికి, ఫిట్ గా ఉండడానికి ముఖ్యమైన వ్యాయామం పరిగెత్తడం. చాలామంది ప్రతిరోజూ ఉదయం రన్నింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది బయట పార్కుల్లో, రోడ్లమీద రన్నింగ్ చేస్తుంటే... కొంతమంది ఇంట్లోనే లేదా జిమ్‌లోనో ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ట్రెడ్ మిల్ రన్నింగ్ లేదా అవుట్ సైడ్ రన్నింగ్‌లలో ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

బయట పరిగెత్తడం వల్ల కలిగే లాభాలు

ఆరు బయట పరిగెత్తినప్పుడు ట్రెడ్ మిల్ పై పరిగెత్తడానికి కావలసిన శక్తి కంటే ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తారు. కాబట్టి త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మీ ఎముకలకు ఎంతో మేలు చేస్తుంది. కాంక్రీట్ వంటి గట్టి ఉపరితలంపై పరిగెత్తినప్పుడు అది గ్రౌండ్ నుంచి కూడా గట్టి రియాక్షన్ ఫోర్సును కాళ్ళ మీద చూపిస్తుంది. దీని వలన మీ ఎముకలు మరింత బలోపేతం అవుతాయి. ట్రెడ్ మిల్ తో రన్నింగ్ చేసిన వారితో పోలిస్తే,బయట రన్నింగ్ చేసిన వారి ఎముకలు దృఢంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి బయట రన్నింగ్ చేసినప్పుడు మీ కాళ్లకు బలం ఎక్కువగా అందుతుంది. ట్రెడ్ మిల్ పై ఇంత బలం కాళ్లకు అందడం కష్టం. బయట పరిగెత్తడం మంచి ఆలోచన. బయట పరిగెత్తడం వల్ల చర్మంపై సూర్యరశ్మి తగులుతుంది. ఇది మీకు విటమిన్ డి అందిస్తుంది. అలాగే స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది. అలాగే డిప్రెషన్, కోపం వంటివి తగ్గుతాయి. ఆరుబయట పచ్చదనం మధ్య పరుగులెత్తితే మానసిక, శారీరక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.

ట్రెడ్ మిల్ పై పరిగెత్తడం వల్ల కలిగే ప్రయోజనాలు

బయట పరిగెత్తడం అన్ని సమయాల్లో వీలుకాదు. కాబట్టి ఎక్కువ మంది ట్రెడ్ మిల్ పై పరిగెత్తడానికి శిక్షణ తీసుకుంటారు. పరుగులు పెట్టడం అన్ని కాలాల్లోనూ వీలవ్వకపోవచ్చు. వర్షాకాలం, చలికాలంలో కూడా ట్రెడ్ మిల్ వినియోగించవచ్చు. వర్షాకాలంలో ఆరుబయట పరుగులు పెట్టడం కుదరదు. మీరు బయట రన్నింగ్ చేసినా, ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసినా మీ శరీరం ఉపయోగించే ఆక్సిజన్ అంతే మొత్తంలో ఉంటుంది.

ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసినా, ఆరుబయట రన్నింగ్ చేసినా రెండింటిలోనూ లాభాలు, నష్టాలు ఉన్నాయి. కార్డియోవాస్కులర్ ప్రయోజనాల కోసం రన్నింగ్ చేస్తున్నవారు ట్రెడ్ మిల్ పై రన్ చేయడం మంచిది. అదే రేసు కోసం లేదా మారథాన్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు బయట పరిగెత్తడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి నిర్ణయం మీదే.

టాపిక్