Tredmill: ఒత్తిడి తగ్గించుకోవాలా? ట్రెడ్ మిల్‌పై పావుగంట పరిగెత్తండి చాలు-tredmill need to reduce stress just run on the treadmill for a quarter of an hour ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tredmill: ఒత్తిడి తగ్గించుకోవాలా? ట్రెడ్ మిల్‌పై పావుగంట పరిగెత్తండి చాలు

Tredmill: ఒత్తిడి తగ్గించుకోవాలా? ట్రెడ్ మిల్‌పై పావుగంట పరిగెత్తండి చాలు

Haritha Chappa HT Telugu
Dec 31, 2023 05:30 AM IST

Tredmill: ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గడానికి ప్రతి రోజు ట్రెడ్ బిల్ పై పావుగంట పరుగులు పెట్టమని చెబుతున్నారు

ట్రెడ్ మిల్ పై రన్నింగ్
ట్రెడ్ మిల్ పై రన్నింగ్ (pexels)

Tredmill: శారీరకంగా ఫిట్‌గా ఉంటే సరిపోదు, మానసికంగా కూడా మీరు ఫిట్ గానే ఉండాలి. వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా రెండు విధాలుగా ఫిట్‌గా ఉండవచ్చు. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గించుకోవాలంటే ప్రతి రోజు ట్రెడ్ మిల్‌పై పావు గంటసేపు పరుగులు పెట్టాలి. దీన్ని చేయడం వల్ల ఒత్తిడి చాలా మేరకు తగ్గుతుంది. ప్రతిరోజూ వేలకు నిద్రించడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చలికాలంలో వాకింగ్ కు ఉదయాన్నే లేచి బయటికి వెళ్లడం కష్టం. చలికి తట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది. ఇంట్లోనే ట్రెడ్ మిల్ పై వాకింగ్, రన్నింగ్ వంటివి చేయవచ్చు.

yearly horoscope entry point

అలవాటు లేని వారికి మొదట్లో ట్రెడ్‌మిల్ పై కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు నెమ్మదిగా వాకింగ్ చేస్తూ రన్నింగ్ వైపుగా మారాలి. రోజు కనీసం పావుగంట సేపు రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండెకు ఈ ట్రెడ్ మిల్‌పై పరుగు ఎంతో మేలు చేస్తుంది. శరీరమంతా రక్త సరఫరా జరిగేలా చేస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. కాబట్టి గుండెపోటు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. గుండె పనితీరును మెరుగుపరిచేలా చేస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ట్రెడ్ మిల్ పై పరుగులు ఆపద్దు.

నిద్రలేమి, ట్రాఫిక్‌లో ఎక్కువసేపు ఇరుక్కోవడం, ఆఫీసు పనులు, ఆర్థికపరమైన ఇబ్బందులు వంటివి మనిషిపై ఒత్తిడిని పెంచేస్తున్నాయి. మానసిక ప్రశాంతత లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మానసిక ప్రశాంతత లేకపోతే ఆయుర్దాయం తగ్గిపోతుంది. కాబట్టి వారు ప్రతి రోజు ట్రెడ్ మిల్‌పై పరుగులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే వారి ఆయుష్షు కూడా పెరుగుతుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం ట్రెడ్ మిల్‌పై పావుగంట సేపు పరిగెడితే చాలు, ఆ రోజంతా చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. వారికి ఎలాంటి సమస్యలు రావు.

ట్రెడ్ మిల్ ఒక్కసారి కొనుక్కుంటే జీవితాంతం వాడుకోవచ్చు. ఈఎమ్ఐ సదుపాయాలతో ఎన్నో ఆఫర్లు ఉన్నాయి. ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టడంలో తప్పులేదు, కాబట్టి పదివేల నుంచి 15 వేల రేంజ్‌లో ఉన్న ట్రెడ్ మిల్‌ను కొనుక్కోండి. ఇది మీకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. బయటికి వెళ్లే ఓపిక లేనప్పుడు ఇంట్లోనే వ్యాయామం చేసుకోవచ్చు. ముఖ్యంగా ముసలివారికి ఇది ఎంతో పనికొస్తుంది.

Whats_app_banner