Dusara Theega : దూసర తీగతో శృంగార సామర్థ్యం.. ఇంకెన్నో ప్రయోజనాలు!
05 March 2023, 17:45 IST
- Dusara Theega Benefits : ప్రకృతిలో ఎన్నో మెుక్కలు చాలా ఉపయోగకరమైనవిగా ఉంటాయి. మన చుట్టు పక్కల ఉన్నా.. వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలాంటిదే దూసర తీగ.
దూసర తీగ
కొన్ని మెుక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వాటి వలన కలిగే ప్రయోజనాలు పెద్దగా తెలియదు. ఇంటి పక్కన, చేనులో నడుస్తుంటే రోడ్డు పక్కన కనిపిస్తాయి. దూసర తీగ కూడా అలాంటిదే. దీనివలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఊర్లలో ఉండే వారికి ఈ మెుక్క గురించి తెలుసు. దూసర తీగ(Dusara Theega) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
గ్రామాల్లో దూసర తీగ ఎక్కువగా ఉంటుంది. పొదలపై తీగలు అల్లుకుంటాయి. చేలు, పొలాల గట్టు మీద పెరుగుతాయి. పెద్దలు ఈ తీగల ఆకుల రసాన్ని పశువుల గాయాలకు రాయడం కనిపిస్తూ ఉంటుంది. త్వరగా మానుతాయి. దూసర తీగ ఆకులను సేకరించి.. ముద్దగా నూరి రసం చేసుకోవాలి. ఈ పసరును ఒక గ్లాస్ లో పోసి ఐదు గంటలపాటు అలాగే ఉంచాలి. జెల్ లాగా తయారు అవుతుంది. కొద్దిగా పటిక బెల్లం కలిపి తినాలి. ఇలా తింటే.. శరీరం(Body)లో ఉన్న వేడి తగ్గుతుంది.
కొంతమందికి కళ్ల మంట, కళ్ల దురద, కంటి(Eye) రెప్పలపై కురుపులు ఏర్పడుతాయి. వీటితో చాలా ఇబ్బంది. అలా ఉండేవారు.. దూసర తీగను బాగా దంచి రసం తీసి ఆ రసాన్ని కను రెప్పలపై రాయాలి. రాత్రి పూట(Night Time) ఇలా చేసి.. మరుసటి రోజు ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడగాలి. సమస్యలు తగ్గుతాయి. చర్మ సమస్యలకు(Skin Problems) దూసర తీగ గొప్పగా పని చేస్తుంది. చర్మంపై దద్దుర్లు, దురద, గజ్జిలాంటి సమస్యలు ఉన్నవారు.. ఈ ఆకుల రసాన్ని రాయాలి. రోజూ ఇలా చేస్తే.. సమస్యలు తగ్గుతాయి.
షుగర్(Sugar)తో బాధపడేవారు కూడా దూసర ఆకులను ఉపయోగించొచ్చు. గుప్పెడు ఆకులను తీసుకుని.. కొద్దిగా నీరు(Water) పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత వచ్చే నీటిని తాగాలి. ఇలా రోజు చేస్తే.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
దూసర తీగ ఆకుల రసాన్ని రోజూ తాగితే.. స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. శృంగార సామర్థ్యం(Sex Stamina) పెరుగుతుంది. సంతానోత్పత్తి సమస్యలు తగ్గి సంతానం కలుగుతుంది. ఈ తీగను దూసర తీగ, పాతాళ గరుడి, సిప్పి తీగ, చీపురు తీగ, గరుడ తీగ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. దూసర తీగ యాంటీ మైక్రో బయాల్ గుణాలను కలిగి ఉంది.
గమనిక : మాకు దొరికిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇచ్చాం. ఏదైనా చేసే ముందు వైద్యులను సంప్రదించండి.