Sexual Health : సెక్స్ తర్వాత యోనిలో మంటగా ఉంటుందా? అయితే కారణం ఇదే..
25 August 2022, 22:06 IST
- Sex Education : సెక్స్ తర్వాత చాలా మంది మహిళలు యోని దగ్గర మంటతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఆ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో.. జరిగితే ఏమి చేయాలో డాక్టర్ క్యూటెరస్ పలు సూచనలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
యోనిలో మంట ఇలా తగ్గించుకోండి..
Sex Education : సెక్స్ తర్వాత యోనిలో మంట మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. సెక్స్ చేయడం వల్ల యోనిపై చాలా ఒత్తిడి వస్తుంది. కానీ మీరు సంభోగం తర్వాత మీ యోని ఓపెనింగ్ దిగువ భాగంలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? ఆ ప్రాంతం అంతా బర్నింగ్ అనిపిస్తుందా? మూత్ర విసర్జన చేసినప్పుడు లేదా నీటిని తాకినప్పుడు అది మిమ్మల్ని బాధిస్తుందా? అయితే అది కచ్చితంగా ఫోర్చెట్ టియరే అంటున్నారు డాక్టర్ క్యూటెరస్ అలియాస్ డాక్టర్ తనయ.
ఫోర్చెట్ అనేది యోని దిగువన ఉన్న చివరి భాగమని.. ఆ పాయింట్ చాలా సన్నని కణజాలమని.. అది చాలా సులభంగా చిరిగిపోతుందని వెల్లడించారు. యోని మంటను నివారించడం, భాగస్వామితో ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని ఎలా ఆస్వాదించవచ్చనే దానిపై రెండు ప్రధాన మార్గాలను ఆమె వెల్లడించింది. సెక్స్ తర్వాత యోని మంటను నివారించే మార్గాలు ఏమిటంటే..
1. లూబ్రికెంట్ ఉపయోగించండి
మొదటిది లూబ్రికెంట్ ఉపయోగించడం. మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో లభించే ఫ్లేవర్ లేని నీటి ఆధారిత లూబ్రికెంట్లను ప్రయత్నించాలని తనయ సూచిస్తున్నారు. దీనిని ఉపయోగించడం వల్ల సెక్స్ సమయంలో కణజాలానికి ఇబ్బంది లేకుండా.. ఫోర్చెట్కి డ్యామేజ్ కాకుండా సాఫీగా లోపలికి వెళ్లడానికి అనుమతిస్తుంది.
2. మెరుగైన ఫోర్ ప్లే
ఫోర్చెట్ టియర్ను నివారించడానికి రెండో మార్గం ఫోర్ ప్లే. ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ఓరల్ సెక్స్ వంటి మొదలైన వాటిని చేయండి.“ఇవి యోని ద్వారం విస్తరించేలా చేస్తాయి. అంతేకాకుండా చుట్టుపక్కల కణజాలం కూడా విస్తరించేలా చేస్తుంది. కాబట్టి చొప్పించడం సులభంగా జరుగుతుందని క్యూటెరస్ తెలిపారు. అయినప్పటికీ.. మీరు క్రమం తప్పకుండా సెక్స్ తర్వాత ఫోర్చెట్ టియర్, యోని మంటలతో ఇబ్బంది పడితే కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సిందేనని డాక్టర్ క్యూటెరస్ తెలిపారు.
యోని మంటను, ఫోర్చెట్ టియర్ను నివారించే స్వీయ సంరక్షణ చిట్కాలు
* ఫోర్చెట్ టియర్ ఇబ్బంది పెడుతున్నప్పుడు సెక్స్ లేదా ఏదైనా రకమైన ఫోర్‌ప్లేను నివారించండి.
* అవసరమైతే సౌకర్యవంతమైన కాటన్ లోదుస్తులను మాత్రమే ధరించండి.
* మీ యోని ప్రాంతాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోండి.
* ప్రభావిత ప్రాంతాన్ని ఎక్కువగా తాకడం మానుకోండి.
* టాంపోన్లను ఉపయోగించవద్దు. బదులుగా ఆ ప్రాంతం నయం అయ్యే వరకు ప్యాడ్లు లేదా పీరియడ్ లోదుస్తులను ఉపయోగించండి.
* చికాకు కలిగించే ఏ రకమైన సువాసనగల సబ్బు, స్పెర్మిసైడ్ లేదా లూబ్రికెంట్‌ని ఉపయోగించకండి.
* మీరు మూత్ర విసర్జన చేసినప్పుడు మంటను తగ్గించడానికి.. యోని మీద గోరువెచ్చని నీటిని పోయాలి. ఎందుకంటే మూత్రం ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి.. కట్ అయిన ప్రాంతం మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడుతుంది.