వర్షాకాలంలో లోదుస్తుల విషయంలో జాగ్రత్త.. యోనిని ఇలా పరిశుభ్రంగా ఉంచుకోండి-monsoon say goodbye to vaginal infections with these easy tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /   Monsoon, Say Goodbye To Vaginal Infections With These Easy Tips

వర్షాకాలంలో లోదుస్తుల విషయంలో జాగ్రత్త.. యోనిని ఇలా పరిశుభ్రంగా ఉంచుకోండి

HT Telugu Desk HT Telugu
Jul 02, 2022 02:17 PM IST

వర్షాకాలంలో తేమ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో మహిళలకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. దీనికి కారణం మహిళలు బట్టలు ధరించే విషయంలో చేసే పొరపాట్లు ఈ ఇన్ఫెక్షన్ వస్తాయి. అలాగే అధిక చెమట కూడా ఇందుకు కారణమవుతుంది.

intimate_hygiene
intimate_hygiene

వర్షాకాలంలో తడిసిన లోదుస్తులు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ సీజన్‌లో, జననేంద్రియాల పరిశుభ్రత చాలా ముఖ్యం. అధిక చెమట, తేమతో కూడిన బట్టలను వేసుకోవడం వల్ల.. ఇవి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా యోని ప్రాంతాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. పొడిగా ఉంచడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఎలాంటి లోదుస్తులను ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1) యోనిని శుభ్రంగా, పొడిగా ఉంచండి

- వర్షాకాలంలో తేమ పెరుగుతుంది, అటువంటి పరిస్థితిలో యోని pH స్థాయి తగ్గుతుంది, దీని కారణంగా మహిళలకు యూరినరీ ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. వర్షాకాలంలో సన్నిహిత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి. దీని కోసం, యోని ప్రాంతాన్ని నీటితో, నిపుణులు సూచించిన హెర్బల్ సబ్బుతో కడగాలి. కొన్ని సోప్స్‌లోని రసాయనాలు యోనిలోని అన్ని మంచి బ్యాక్టీరియాను చంపేస్తుంది కాబట్టి డౌచింగ్‌ను నివారించేందుకు ప్రయత్నించండి. దీనితో పాటు, మీరు మీ సన్నిహిత ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యం

2) వ్యాయామం తర్వాత లోదుస్తులను మార్చండి-

వ్యాయామం చేసిన తర్వాత మీరు మీ దుస్తులను పూర్తిగా మార్చుకోవాలి. లోదుస్తులు, స్విమ్సూట్ను తొలగించిన తర్వాత, సన్నిహిత ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయండి. పూర్తిగా ఆరిన తర్వాత బట్టలు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు.

3) పెర్ఫ్యూమ్ అప్లై చేయడం మానుకోండి-

చాలా మంది అమ్మాయిలు చేసే పొరపాటు ఇదే. వాసన రాకుండా ఉండేందుకు సన్నిహిత ప్రాంతంలో పెర్ఫ్యూమ్ ఉపయోగించడం వల్ల సమస్య పెరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, యోని చుట్టూ పెర్ఫ్యూమ్ లేదా డియోడరెంట్ పూయడం వల్ల అలెర్జీలు లేదా దద్దుర్లు ఏర్పడవచ్చు.ఇది మీకు మరింతగా సమస్యగా మారవచ్చు.

4) బిగుతుగా ఉండే బట్టలు ధరించడం మానుకోండి-

వర్షాకాలంలో మీరు స్కిన్నీ జీన్స్, టైట్ షార్ట్‌లు లేదా బిగుతుగా ఉండే లోదుస్తులను ధరించడం మానుకోవాలి, బిగుతుగా ఉండే దుస్తులతో తేమ ఎక్కువగా ఉండటం వల్ల అధిక చెమట పట్టవచ్చు.బిగుతుగా ఉండే దుస్తులు వల్ల యోని చుట్టుపక్కల ప్రాంతంలో గాలి ప్రసరణ తక్కువగా ఉన్నందున దద్దుర్లు, యోని ఇన్ఫెక్షన్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

5) పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించండి -

సరైన సమయంలో శానిటరీ ప్యాడ్‌లను మారుస్తూ ఉండండి. ఎక్కువ సేపు శానిటరీ ప్యాడ్ మార్చకపోతే చర్మంపై దద్దుర్లు రావడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంది. ప్లో బట్టి , ప్రతి 6-8 గంటలకు శానిటరీ ప్యాడ్ మార్చాలి. ప్లో తక్కువగా ఉన్న కూడా ఇది వర్తిస్తుంది.

సరైన లోదుస్తులను ఎలా ఎంచుకోవాలి

వర్షాకాలంలో లోదుస్తుల ఎంపికలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో, కాటన్ ఫాబ్రిక్ లోదుస్తులు ఉత్తమమైనవి. కాటన్ దుస్తులు చర్మాన్ని పొడిగా, చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాంటి లోదుస్తులు ధరించడం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి. ఈ రకమైన లోదుస్తులు మీ చర్మానికి సరైన గాలి ఆడేలా చేస్తాయి. ఈ సందర్భంలో, తెలుపు లోదుస్తులు మంచి ఆప్షన్. వీటిని శుభ్రం చేస్తున్పప్పుడు తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించండి. లో దుస్తులను మిగిలిన బట్టల నుండి విడిగా ఉతకడానికి ప్రయత్నించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్