Great Sex Tips : సెక్స్‌లో ఒకరు సంతృప్తి చెందితే చాలదు.. మీ భాగస్వామి కూడా అవ్వాలి..
సెక్స్ అనేది ఇద్దరు భాగస్వాములు ప్రమేయంతో, పరస్పరం ఇష్టంతో జరిగే ఓ టూ-వే చర్య. అయినప్పటికీ చాలామంది మగవారు.. తాము అనుకున్న పని అయిపోతే చాలు అన్నట్లుగా పనికానిచ్చేస్తారు. ఇలాంటి అనుభవాలు ఉన్న మహిళలు చాలామంది తమ సెక్స్ లైఫ్ పట్ల విముఖత చెందుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే మగవాళ్లు తమ తప్పులను సరిచేసుకుంటే మంచి ఫీల్‌ని ఇద్దరూ ఎంజాయ్ చేయగలరు అంటున్నారు నిపుణులు.
Great Sex Tips : చాలా మంది మగవారు.. ఆఫీస్‌లో కష్టపడి ఇంట్లో పడకగది సుఖాన్ని కోరుకుంటారు. అది తప్పేమి కాదు కానీ.. పడకగది సుఖం కూడా ఓ ఉద్యోగంలా చేసేస్తారు. ఇలా చేయడం వల్ల చాలామంది భార్యలు, లేదా సెక్స్ పార్ట్నర్లు సెక్స్ పట్ల చాలా విముఖత చూపిస్తున్నారు. అసలు మీ భాగస్వామి ఏమి కావాలనుకుంటుందో తెలుసుకోకుండా చేస్తే.. మీకు, జంతువులకు పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. నిపుణులు సూచించిన ఈ చిన్ని మార్పుల గురించి తెలుసుకుని.. మీ భాగస్వామితో కలిసి.. సెక్స్ లైఫ్‌ని ఎంజాయ్ చేయండి.
సెక్స్ శరీరంతోనే కాదు..
పురుషులు అయినా.. స్త్రీలు అయినా.. సెక్స్ అంటే శరీరాలకు సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటే. సెక్స్ మీ భాగస్వామిని మీకు దూరం చేస్తుంది అంటే.. ఫిజికల్‌గా మీరు ఇచ్చే సుఖం కాదు. మెంటల్‌గా వారు మీ నుంచి కోరుకునే సుఖం వల్ల కావొచ్చు. పురుషులు ఈ విషయం తెలుసుకోవడం చాలా అవసరం. ఆమెతో మాట్లాడండి. ఆమెకు ఈ సమయంలో ఈ పని చేయడం ఇష్టమో కాదో తెలుసుకోండి. కొంతసేపు ఆమెతో ముచ్చట్లాడుతూ ఉంటే.. వారు కూడా రిలాక్స్ అవుతారు. శృంగారానికి ముందు మాటలు ఎంత అవసరమో.. ఆ పని ముగిశాక కూడా కమ్యూనికేషన్ అంతే అవసరమని గుర్తించుకోవాలి.
ఇద్దరికీ ఒకేలాంటి కోరికలుండవు..
అవును ఏ ఇద్దరికీ ఓకేలాంటి సెక్స్ కోరికలుండవు. స్త్రీలకు ఏమి కోరికలుంటాయి అని వారి భావాలను గాలికి వదిలేయకండి. వారికి కూడా చాలా ఫాంటసీలు ఉంటాయని గుర్తించండి. మగవాళ్ల కంటే స్త్రీలకే ఎక్కువ ఫాంటసీలు ఉంటాయని ఓ టాక్ కూడా ఉంది. కాబట్టి వారు మీ నుంచి ఏమి కోరుకుంటున్నారు. ఫ్రీక్వెన్సీ స్థాయిలు.. లైంగిక కోరికస్థాయిలు గురించి వారితో చర్చించండి. ఇలా భాగస్వాములు మాట్లాడుకోవడం చాలా అవసరం. మీ భాగస్వామి ఇవేమి మీతో మాట్లాడట్లేదంటే.. మీ విషయంలో అసంతృప్తిగా ఉండడం వల్లే.. వాటి మీద శ్రద్ధ చూపించలేకపోతున్నారని అర్థం.
రొటీన్‌కి బ్రేక్ ఇవ్వండి..
సెక్స్ విషయంలో రొటీన్ ప్రాసెస్‌ను ఎవరూ ఇష్టపడరు. నిజానికి సెక్స్ అనేది ఓ కళ కాబట్టి.. విభిన్న స్థానాలు, పద్ధతులను ప్రయత్నించడం చాలా ముఖ్యం. మీ సెక్స్ జీవితాలను మెరుగుపరచుకోండి. రిఫ్రెష్ అవ్వండి. లేదంటే మీ భాగస్వామి మీ పట్ల శారీరకంగా.. లేదా సెక్స్ పట్ల ఆసక్తిని కోల్పోతారు.
ఇదేమి రేస్ కాదు..
పురుషులు సగటున సెక్స్ ప్రారంభించిన 5-6 నిమిషాల తర్వాత స్కలనం చేస్తారు. మహిళలు ఎక్కువ సమయం తీసుకుంటారు. వారికి ఫీలింగ్స్ లేట్‌గా వస్తాయి కాబట్టి.. వారు సులభంగా 15 నిమిషాల వరకు ఆ ఫీల్‌లో ఉండవచ్చు. కాబట్టి ఏదో మారథాన్ రేస్లాగా కాకుండా.. వారితో మాట్లాడుతూ.. రొమాన్స్ చేస్తూ.. వారి దగ్గర మంచి మార్కులు కొట్టేయొచ్చు.
అంతేకాకుండా పని పూర్తి అవ్వగానే ఎవరో తరముకొస్తున్నట్లు పక్కకు వెళ్లిపోకండి. మీ భాగస్వామిని దగ్గరకు తీసుకోండి. ఒకవేళ ఆమె మాట్లాడితో చిరాకు పడకుండా వినండి. ఈ తరహా పనులు ఆమె మిమ్మల్ని మరింత కోరుకునేలా చేస్తాయి.
సంబంధిత కథనం
టాపిక్