తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Exercises For Tight Vagina: యోని కండరాల్ని బిగుతుగా చేసే వ్యాయామాలు, నెల రోజుల్లోనే మార్పు

Exercises for Tight Vagina: యోని కండరాల్ని బిగుతుగా చేసే వ్యాయామాలు, నెల రోజుల్లోనే మార్పు

15 October 2024, 5:00 IST

google News
  • Exercises for Tight Vagina: ప్రసవం తర్వాత, ఆరోగ్య సమస్యల వల్ల యోని వదులుగా మారితే ఇబ్బందులకు కారణం అవుతుంది. ఈ సమస్య తగ్గడానికి ప్రతిరోజూ ఈ 3 వ్యాయామాలు చేయడం ప్రాక్టీస్ చేయండి.

యోనిని బిగుతుగా మార్చే వ్యాయమాలు
యోనిని బిగుతుగా మార్చే వ్యాయమాలు (shutterstock)

యోనిని బిగుతుగా మార్చే వ్యాయమాలు

ప్రసవం, ప్రెగ్నెన్సీ తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా పొట్ట, యోని కాస్త వదులుగా మారడం సర్వసాధారణం. దీనివల్ల మూత్రంపై నియంత్రణ తగ్గడమే కాదు. కలయిక సమయంలోనూ కలిగే అనుభూతి మీద ప్రభావం చూపుతుంది. దీనికోసం కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. వాటి సహాయంతో యోని బిగుతుగా మారుతుంది. అలా రోజూ చేయవలసిన వ్యాయామాలు ఏమిటో తెలుసుకోండి.

కీగెల్ ఎక్సర్‌సైజులు:

కీగెల్ వ్యాయామాల గురించి తెలిసే ఉంటుంది. కానీ వాటిని చేయడానికి సరైన పద్ధతి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. కీగెల్ వ్యాయామాలను ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు.ఈ వ్యాయామం చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి.

  1. మొదట, వ్యాయామం చేసే కన్నా ముందు మూత్ర విసర్జన చేయండి. దాంతో మూత్రాశయం ఖాళీగా అవుతుంది. ఇది వ్యాయామం చేయడం సులభతరం చేస్తుంది.
  2. ఇప్పుడు ఒక చోట ప్రశాంతంగా కూర్చోండి. యోని భాగంలో ఉండే కండరాలను అనుభూతి చెందండి. వాటిని వీలైనంత లోపలికి లాక్కున్నట్లు చేయండి.
  3. లోపలికి లాగేటప్పుడు శ్వాస తీసుకోవడం, తర్వాత శ్వాస వదలడం చేయండి.
  4. ఈ వ్యాయామాన్ని రోజుకు కనీసం నాలుగు నుంచి అయిదు నిమిషాలు చేయొచ్చు. ఈ వ్యాయామంలో చేసే సంకోచ వ్యాకోచాల వల్ల యోని దగ్గర కండరాలు బిగుతుగా మారతాయి.

బ్రిడ్జ్ పోజ్

బ్రిడ్జ్ పోజ్ ప్రసవం తర్వాత వదులుగా ఉన్న యోనిని బిగుతుగా మార్చడానికి సాయం చేస్తుంది. ఈ వ్యాయామం చేయడానికి మీ వీపుపై వెల్లకిలా పడుకోండి. నడుమును వీలైనంత పైకి లేపండి. ఈ సమయంలో భుజాలు నేలకు తాకేలా ఉంచండి. ఇప్పుడు రెండు మోకాళ్ల మధ్య కుషన్ లేదా దిండును నొక్కి పెట్టి దానిపై ఒత్తిడిని తీసుకురండి. అలాగే, శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల తొడ నుంచి యోని కండరాల్లో సాగదీసిన అనుభూతి కలుగుతుంది.

శలభాసన

శలభాసనం భంగిమ చేయాలంటే మ్యాట్ మీద బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత భుజాలు, ఛాతీ, తల మీకు వీలైనంత పైకెత్తాలి. దీనితో పాటు, మోకాళ్లతో సహా కాళ్ళను పైకి లేపి ఉంచాలి. ఈ యోగా భంగిమ చేసేటప్పుడు తొడ, యోని కండరాలలో సాగదీతను అనుభూతి చెందండి. అలాగే శ్వాస తీసుకుంటూ వదలడం ఆపకండి.

ఈ యోగాసనాలను రోజూ చేయడం వల్ల కేవలం నెల రోజుల్లోనే ఆ ప్రభావం వల్ల యోని కండరాలు బిగుతుగా మారతాయి.

తదుపరి వ్యాసం